మా ప్రేమ కూడా ఉద్య‌మ‌మే

  • IndiaGlitz, [Monday,July 01 2019]

'దొర‌సాని' ట్రైల‌ర్ విడుద‌లైంది. ఈ చిత్రం ద్వారా ఆనంద్ దేవ‌ర‌కొండ‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌యం అవుతున్నారు. తెలంగాణ నేప‌థ్యంలో సాగే ఈ ప్రేమ‌క‌థ‌పై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. ఇప్పుడు ట్రైల‌ర్ ఆస‌క్తిని మ‌రింత పెంచింది. ఇందులో ఒక ప‌క్క రాజు, దొరసారి మ‌ధ్య ప్రేమ క‌థ‌తో పాటు.. మ‌రో ప‌క్క న‌క్స‌లిజం కాన్సెప్ట్‌తో ఈ క‌థ‌ను రూపొందించారు. 1980ల్లో ప్రేమ‌క‌థ‌లు ఎలా ఉండేవి? అదే స‌మ‌యంలో ఉద్య‌మ ప్ర‌భావం ఎలా ఉండేది? అంశాల‌ను సినిమాలో చూపించ‌బోతున్న‌ట్లు తెలిసింది.

పేద‌వాడుగా ఆనంద్ దేవ‌ర‌కొండ‌, దొర‌సానిగా శివాత్మిక చ‌క్క‌గా న‌టించారని ట్రైల‌ర్ ప్రెజంటేష‌న్‌లో తెలుస్తోంది. కేవీఆర్ మ‌హేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి, య‌ష్ రంగినేని నిర్మించిన ఈ చిత్రం సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో విడుద‌ల‌వుతుంది. ప్ర‌శాంత్ ఆర్‌.విహారి సంగీతాన్ని అందించారు. జూలై 12న సినిమా విడుద‌ల అవుతుంది.

More News

బోయపాటికి షాక్.. కుర్ర డైరెక్టర్‌కు బాలయ్య గ్రీన్ సిగ్నల్!

సీనియర్ హీరోలంతా కుర్ర డైరెక్టర్లతో సినిమాలు తీయడానికి క్యూ కడుతున్నారు. ఇందుకు చక్కటి ఉదాహరణ ‘కల్కి’. సీనియర్ హీరో.. ఒకప్పుడు టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన రాజశేఖర్‌కు కుర్ర డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ

ఘ‌నంగా 'రాజ్ ధూత్' ప్రీ రిలీజ్ ఈవెంట్!

స్వ‌ర్గీయ రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి త‌న‌యుడు మేఘాంశ్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతోన్న చిత్రం `రాజ్ ధూత్`. న‌క్ష‌త్ర‌, ప్రియాంక వ‌ర్మ హీరోయిన్లు. ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై అర్జున్ -కార్తీక్..

జోగయ్య త్వరగా కోలుకోవాలి.. నాకు మార్గదర్శకులు కావాలి!

జనసేన పార్టీ హితం కోరుకొనే చేగొండి హరిరామ జోగయ్య త్వరగా కోలుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. తనకు, పార్టీకి మార్గదర్శకులుగా వ్యవహరించాలని కోరితే వారు అందుకు అంగీకారం తెలిపారు.

'కల్కి' బి, సి సెంటర్ మాస్ సినిమా! - దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇంటర్వ్యూ

'అ!' చిత్రంతో అటు ప్రేక్షకుల్ని, ఇటు విమర్శకుల్ని ఆకట్టుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. తెలుగు ప్రేక్షకులు కొత్త తరహా చిత్రాన్ని అందించారు. 'అ!' తర్వాత ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'కల్కి'.

ప్రేక్షకులకు బెస్ట్ ఫిల్మ్ ఇవ్వాలనే కసితో ఈ సినిమా చేశాం - నిను వీడని నీడను నేనే' ట్రైలర్ ఆవిష్కరణలో సందీప్ కిషన్

సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం 'నిను వీడని నీడను నేనే'. అన్యా సింగ్ కథానాయిక. కార్తీక్ రాజు దర్శకుడు.