బోయపాటికి షాక్.. కుర్ర డైరెక్టర్‌కు బాలయ్య గ్రీన్ సిగ్నల్!
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ హీరోలంతా కుర్ర డైరెక్టర్లతో సినిమాలు తీయడానికి క్యూ కడుతున్నారు. ఇందుకు చక్కటి ఉదాహరణ ‘కల్కి’. సీనియర్ హీరో.. ఒకప్పుడు టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన రాజశేఖర్‌కు కుర్ర డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సూపర్ హిట్టిచ్చిన విషయం విదితమే. దీంతో ఆయనతో సినిమాకు నేను రె‘ఢీ’ అని బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ మాట్లాడుతూ.. తాను బాలయ్యకోసం కథ సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. అయితే.. బాలయ్య- ప్రశాంత్ మధ్య స్క్రిప్ట్‌ను డిస్కషన్ ఇంకా రాలేదు. అయితే ప్రశాంత్ నోట ఇప్పటి వరకూ పలుమార్లు బాలయ్య పేరు వచ్చింది. దీంతో అతి త్వరలోనే కథ వినిపించేందుకు డైరెక్టర్ సిద్ధమవుతారని తెలుస్తోంది.
ప్రశాంత్ వర్మ తీసిన తొలి చిత్రం ‘అ!’ నందమూరి బాలకృష్ణకు బాగా నచ్చిందట. ఆ సినిమా చూసిన తర్వాత ఆయన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నటించాలని అనుకుంటున్నారని ఇండస్ట్రీలో చర్చలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పటికే బాలకృష్ణ కెఎస్ఎస్ రవికుమార్ కాంబినేషన్లో ఓ సినిమా చేస్తున్నాడు.. దీని తర్వాత వెంటనే బోయపాటి సినిమా లైన్లో ఉంది. అయితే బాలయ్య మాత్రం మొదట ప్రశాంత్‌కే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని.. బోయపాటి సినిమా సంగతి తర్వాత చూద్దామని అనుకుంటున్నారట. అంటే బోయపాటికి షాకిచ్చి.. ప్రశాంత్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారన్న మటా.
మరోవైపు.. ప్రశాంత్ వర్మ చెప్పిన కథ బావున్నా కూడా అలాగే కాల్షీట్లు కేటాయిస్తారా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది. అయితే.. ఓ వైవిధ్యమైన చిత్రం తప్పక ఉంటుందని అభిమానుల్లో కొందరి అభిప్రాయపడుతున్నారు. మరి బాలయ్య-ప్రశాంత్ ఈ కాంబినేషన్‌ని ఎప్పుడు తెరపైకి వస్తుందో..? ఈ కాంబోలో వచ్చిన మూవీని ఆడియన్స్ ఎంతవరకు ఆదరిస్తారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.