close
Choose your channels

నన్ను చూసి అంతా షాకవుతారు: సమంత

Monday, November 16, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అక్కినేని వారి కోడలు సమంత డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతోంది. వెబ్ సిరీస్‌లో నటించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సామ్ పలు వైవిధ్యమైన రోల్స్‌లో నటించి అలరించింది. ఇప్పుడు మరింత వైవిధ్యమైన పాత్ర ఇప్పటి వరకూ ఆమె కెరీర్‌లోనే నటించనటువంటి ఓ ఆసక్తికర పాత్రలో సామ్ నటించనుంది. లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి డిజిటల్ కంటెంట్‌కు ప్రాధాన్యత విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. దీంతో స్టార్స్ అంతా డిజిటల్ బాట పడుతున్నారు.

ఈ క్రమంలోనే సమంత కూడా వెబ్ సిరీస్‌లో నటించేందుకు సిద్ధమవుతోంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సిరీస్‌తో సామ్ డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతోంది. ఈ వెబ్ సిరీస్ తొలి సీజన్ అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయింది. వచ్చే నెలలో రెండో సీజన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండో సీజన్‌లో సామ్ నటించనుంది. దీనికి సంబంధించిన విశేషాలను సామ్ ఓ ఆంగ్ల మీడియాతో పంచుకుంది. ఈ వెబ్ సిరీస్‌లో తీవ్రవాదిగా సామ్ కనిపించనుంది. తమకు రూల్స్ బ్రేక్ చేసే అవకాశాన్ని ఓటీటీ కల్పించిందని.. `ఫ్యామిలీ మేన్-2`లో సరికొత్తగా కనిపించబోతున్నానని.. తనను చూసి అంతా షాక్ అవుతారని సామ్ తెలిపింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.