నానా పటేకర్ విషయం.. అంతా ఓకే
Send us your feedback to audioarticles@vaarta.com
`హార్న్ ఓకే ప్లీజ్` సినిమా సెట్లో నానా పటేకర్ తనను లైంగికంగా ఇబ్బందిపెట్టారని తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలు నిలబడలేదు.ఈ ఆరోపణలనుంచి నానా పటేకర్ బయటపడ్డారు.తనుశ్రీ దత్తా వేధింపులకు సంబంధించి ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లభించలేదన్న కారణంతో నానా పటేకర్‌కు క్లీన్ చిట్ ఇచ్చారు.
ఇంతకు ముందుకూడా నానా పటేకర్‌కు సంబంధించి క్లీన్ చిట్ ఇస్తారని పలుమార్లు వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని తనుశ్రీదత్తా అన్నారు. నృత్య దర్శకుడు గణేష్ ఆచార్యతో కలిసి తనను లైంగికంగా వేధించిన నానా పటేకర్‌ను అంత తేలిగ్గా వదిలిపెట్టరని ఆమె అన్నారు.
ఆమెతో పాటు ఆమె తరఫు న్యాయవాది నితిన్ కూడా ఈ విషయాన్నే చెప్పారు. అయితే తాజాగా వారి మాట నెగ్గలేదు. నానా పటేకర్‌కు వ్యతిరేకంగా ఆధారాలు దొరక్కపోవడంతో కేసు ముందుకు సాగలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.