close
Choose your channels

ఆన్‌లైన్‌లోకి సమంత... ఏం బాంబు పేలుస్తారో, ఈ రోజు సాయంత్రం రెడీగా ఉండండి..!

Tuesday, September 28, 2021 • తెలుగు Comments

ఆన్‌లైన్‌లోకి సమంత... ఏం బాంబు పేలుస్తారో, ఈ రోజు సాయంత్రం రెడీగా ఉండండి..!

సమంత.. సమంత.. సమంత.. ప్రస్తుతం సోషల్ మీడియాలో, తెలుగు చిత్ర సీమలో ఎక్కడ చూసినా ఈమే పేరే గట్టిగా వినిపిస్తోంది. గత కొన్ని రోజులుగా అక్కినేని వారి కోడలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నో ఏళ్ల పాటు ప్రేమను కొనసాగించి, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న సామ్, చైతన్య జంట విడాకులు తీసుకోబోతున్నారనే వార్త ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయమై అక్కినేని ఫ్యామిలీ కానీ సమంత సన్నిహిత వర్గాలు కానీ నోరు విప్పకపోవడంతో నిప్పులేనిదే పొగ రాదన్న చందంగా వ్యవహారం తయారైంది. కానీ వీరి రిలేషన్‌పై మాత్రం గాసిప్పులు ఆగడం లేదు.

ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన సమయంలో ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ‘బుద్ది ఉందా.?’ అని బదులిచ్చిన నాటి నుంచి సమంత టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. ప్రస్తుతం ఈ చెన్నై చిన్నది సోషల్‌ మీడియాలో ఏ చిన్న పోస్ట్‌ చేసినా అది వైరల్ అయి కూర్చొంటోంది. మరోవైపు తన వైవాహిక జీవితానికి సంబంధించి ఎలాంటి వార్తలు వస్తున్నా వాటన్నింటినీ పట్టించుకోని సమంత ప్రస్తుతం చెన్నైలో స్నేహితులతో ఎంజాయ్‌ చేస్తోంది.

ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ పోస్ట్‌ చేసింది సామ. ఈ రోజు (సెప్టెంబర్‌ 28) సాయంత్రం 5 గంటలకు తాను ఆన్‌లైన్‌లోకి రానున్నట్లు తెలిపింది. ఇక ఉదయం 11 గంటలకు ‘వన్‌ విత్‌ సాకీ’ని సమంత ఎలా సెలబ్రేట్‌ చేసుకుంటుందో ఐజీ స్టోరీలో అడగండి అంటూ ఓ పోస్ట్‌ చేసింది. మరి సమంతను అభిమానులు ఎలాంటి ప్రశ్నలు అడగనున్నారు.? చైతో బ్రేకప్ గురించే ఎక్కువగా ప్రశ్నలు వుంటాయా..? అందుకు తగ్గట్లుగానే సామ్ ముందే ప్రిపేర్ అయ్యారా..? లేకపోతే ఈ పుకార్లకు ఒకే ఒక్క లైవ్‌తో చెక్ పెట్టేయాలని అనుకుంటున్నారా..? ఏం జరగనుందో తెలియాలంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. ఇక సినిమాల విషయానికొస్తే సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. వీటితో పాటు తమిళంలో ఓ సినిమాలో నటిస్తోంది. విజ్ఞేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయనతార కూడా నటిస్తుండడం విశేషం

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz