close
Choose your channels

కుక్క మొరిగింది... పట్టించుకోవచ్చు: ‘‘ బాలయ్య ’’ ఫోటోతో పోసానికి నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్

Wednesday, September 29, 2021 • తెలుగు Comments

కుక్క మొరిగింది... పట్టించుకోవచ్చు: ‘‘ బాలయ్య ’’ ఫోటోతో పోసానికి నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్

అటు ఏపీ మంత్రులు, వైసీపీ నేతు, పోసాని కృష్ణ మురళి తన సోదరుడు పవన్‌ కల్యాణ్‌పై చేస్తున్న విమర్శలకు మెగా బ్రదర్ నాగబాబు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఒక్క మాటకుండా చెప్పకుండా... మీమ్స్‌, ఇమోజీలు, వీడియోల రూపంలో ఘాటు సమాధానాలు ఇచ్చారు.. మంగళవారం పోసాని కృష్ణ మురళి వరుసగా రెండోసారి పవన్‌పై విరుచుకుపడిన అనంతరం... నాగబాబు ‘ఆస్క్‌ మీ’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల ముందుకు వచ్చారు. ‘మళ్లీ పాలిటిక్స్‌లో వస్తారా అంకుల్‌’ అనే ప్రశ్నకు... ‘నాకు ఇంట్రెస్ట్‌ పోయింది’ అనే మీమ్‌తో ఆన్సర్‌ ఇచ్చారు.

‘పవన్‌ కల్యాణ్‌ మేటర్‌ మాట్లాడు అన్నా’ అని ఓ అభిమాని అడిగితే... గతంలో పవన్‌ గురించి పోసాని కృష్ణమురళి మాట్లాడిన వీడియోను నాగబాబు పోస్ట్‌ చేశారు. అందులో ‘‘పవన్‌కల్యాణ్‌ ఈ రోజు మళ్లీ సినిమా హీరోగా యాక్ట్‌ చేస్తానంటే.. నేను అతనికి బ్లాంక్‌ చెక్‌ ఇస్తా. ఎన్ని సున్నాలైనా పెట్టుకోవచ్చు. కోటా, రెండు కోట్లా, పది కోట్లా, ఇరవై కోట్లా, 30 కోట్లా! 40 కోట్లు కూడా ఇస్తా. నాకు డేట్స్‌ ఇస్తే. అంత డిమాండ్‌ ఉన్న హీరో. తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు, ఇండియాలోని టాప్‌ హీరోల్లో అతనొకరు. అతను ఐదు కోట్లు, పది కోట్ల కోసం లంగా పనులు చేయడు. నాకు తెలుసు’’ అని అందులో పోసాని పవన్ కల్యాణ్‌ను ప్రశంసించారు.

మరో నెటిజన్‌ ‘సార్‌... ఏపీ మూవీ టికెట్స్‌ గురించి మీ అభిప్రాయం ఏమిటి?’ అని ప్రశ్నించగా... ‘విక్రమార్కుడు’ చిత్రంలో రవితేజ, బ్రహ్మానందం మోసాలు చేసి డబ్బులు పంచుకునే సన్నివేశాన్ని పోస్ట్‌ చేశారు. ‘చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఎప్పుడైనా సరిగా పంచావ్‌రా!’ అంటూ బ్రహ్మానందం వాపోయే సీన్‌ చూపించారు. ‘మోసం చేసినవాడు బాగుపడడురా!’ అని బ్రహ్మానందం శపించగా... ‘ఆ మనం చేసేది గుళ్లో పూజ మరి’ అని రవితేజ లైట్‌ తీసుకుంటాడు. పేర్ని నాని పై కూడా విమర్శలు చేశారు. పేర్ని నాని అద్భుతంగా నటిస్తాడని అతనికి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు అని వ్యాఖ్యానించారు. అలాగే సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం కూడా మెల్లిగా కుదుట పడుతుందని తెలిపారు. అలాగే మీరు ఏ బ్రాండ్ తాగుతారని ఓ అభిమాని ప్రశ్నించగా... ‘ప్రెసిడెంట్‌ మెడల్‌, ఆంధ్రా గోల్డ్‌, గెలాక్సీ, బూమ్‌ బూమ్‌’ అంటూ ఏపీలో ఇప్పుడు విక్రయిస్తున్న లిక్కర్ బ్రాండ్లను పోస్ట్ చేసి వైసీపీకి నాగబాబు చురకలు వేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz