close
Choose your channels

Governor:తమది ప్రజా ప్రభుత్వం.. తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం..

Thursday, February 8, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. కాళోజీ వ్యాఖ్యలతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు గవర్నర్‌. గతంలో ప్రజాభవన్‌కు అనుమతి లేని ప్రజలకు నేరుగా తమ సమస్యలు చెప్పుకునేలా సిద్ధం చేశామన్నారు. తమ ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తుందని తెలిపారు. ప్రజాపాలనలో భాగంగా గ్రామసభలు నిర్వహిస్తున్నామని.. ఈ కార్యక్రమం కింద 1.8 కోట్ల దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. ఇటీవల దావోస్ సదస్సులో రూ.40వేల కోట్ల ఒప్పందాలు జరిగాయని వివరించారు.

తమ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో రెండు హామీలు ఇప్పటికే అమలు చేశామని.. త్వరలోనే మరో రెండు అమలు చేస్తామని స్పష్టంచేశారు. రూ. 500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లకే ఉచిత విద్యుత్ వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకొస్తామన్నారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలు 15 కోట్ల ట్రిప్పులు ప్రయాణించారని తెలిపారు. అలాగే టీఎస్పీఎస్సీ ద్వారా 2లక్షల కుటుంబాల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. పాలమూరు-రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తుందని చెప్పుకొచ్చారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కలిసివచ్చిన వ్యక్తులు, పార్టీలకు ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతోందని చెప్పారు. యువకుల బలిదానాల వల్ల తెలంగాణ వచ్చిందని గుర్తుచేశారు. తెలంగాణ ఇచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ధన్యావాదాలు చెబుతున్నామన్నారు. తెలంగాణ ఏర్పాటులో సోనియా గాంధీ పోషించిన పాత్రను స్మరించుకుంటుందని ఆమె తెలియజేశారు.

పెద్ద ఎత్తున మూసీ రివర్‌ ఫ్రంట్ అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపట్టనుందన్నారు. మరోసారి మూసీ నది హైదరాబాద్‌ జీవనాడిగా మారనుందన్నారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో భాగంగా అంతర్భాగం, పాదచారుల జోన్‌లు, హాకర్ ప్రాంతాలు, నగరమంతటా పచ్చని ప్రదేశాలు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. అలాగే వెనుకబడిన తరగతుల సామాజిక విద్యాపరమైన ఆర్థిక, ఉద్యోగ, రాజకీయ అవకాశాలను అంచనా వేయడానికి అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు కులగణన చేపట్టాలని నిర్ణయించిందన్నారు. తెలంగాణని క్రీడా రంగంలో అగ్రగామిగా ఎదిగేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని గవర్నర్ వెల్లడించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.