close
Choose your channels

'గులాబీ మేడ' ఆడియో ఆవిష్కరణ

Tuesday, September 19, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అల్లు వంశీ, అక్షర జంటగా ఎల్‌.వి. క్రియేటివ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై బొండా వెంకటస్వామి నాయుడు దర్శకత్వంలో లెంకల అశోక్‌రెడ్డి నిర్మిస్తున్న లవ్‌ అండ్‌ హార్రర్‌ ఎంటర్‌టైనర్‌ 'గులాబీ మేడ'. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. కాగా, ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ సోమవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో పలువురు సినీ ప్రముఖుల నడుమ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటి కవిత, తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్‌, తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, సెక్రటరీ సాయి వెంకట్‌, నిర్మాత మోహన్‌గౌడ్‌, దర్శకుడు నల్లపూసలు బాబ్జీ, చిత్ర దర్శకుడు బొండా వెంకటస్వామినాయుడు, చిత్ర నిర్మాత లెంకల అశోక్‌రెడ్డి, లెంకల సత్యనారాయణరెడ్డి, ఆర్‌.పి., సంగీత దర్శకుడు సాకేత్‌నాయుడు, డాన్స్‌మాస్టర్‌ సూర్యకిరణ్‌ రేలంగి, ఆర్‌.కె.బాబాయ్‌, రాజనాల రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. బిగ్‌ సీడీని ప్రతాని రామకృష్ణగౌడ్‌ ఆవిష్కరించగా, ఆడియో సీడీని కవిత విడుదల చేశారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ - ''రొమాన్స్‌, హార్రర్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ సినిమా డెఫినెట్‌గా సక్సెస్‌ అవుతుంది. పాటలు, ట్రైలర్స్‌ చాలా బాగున్నాయి. సినిమా సక్సెస్‌ అయితే నిర్మాత అశోక్‌రెడ్డిగారు మరిన్ని చిత్రాలు నిర్మిస్తారు. కొత్తవాళ్ళు ఇండస్ట్రీకి ఎంతోమంది రావాలి. వస్తేనే ఇండస్ట్రీ కళకళలాడుతుంది'' అన్నారు.

ప్రతాని రామకృష్ణగౌడ్‌ మాట్లాడుతూ - ''గతంలో గులాబి టైటిల్‌తో వచ్చిన చిత్రాలన్నీ చాలా పెద్ద హిట్‌ అయ్యాయి. గులాబీమేడ కూడా పెద్ద సక్సెస్‌ అవుతుందన్న నమ్మకం వుంది. లవ్‌ హార్రర్‌ కథాంశంతో వచ్చిన సినిమాలన్నీ సూపర్‌హిట్‌ అయ్యాయి. ఈ సినిమా కూడా పెద్ద హిట్‌ అవుతుంది. దసరా నుంచి చిన్న సినిమాల కోసం 5వ షోకు సంబంధించిన జి.వో.ను ప్రభుత్వం విడుదల చేసింది. చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. కంటెంట్‌ బాగుంటే చిన్న సినిమానే పెద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుందని ఈమధ్య విడుదలైన చాలా చిన్న సినిమాలు నిరూపించాయి. ఈ సినిమా రిలీజ్‌ విషయంలో ఆంధ్ర, తెలంగాణలలో అత్యధిక థియేటర్స్‌ ఇప్పించేందుకు నావంతు సహకారాన్ని అందిస్తాను'' అన్నారు.

సాయివెంకట్‌ మాట్లాడుతూ - ''డైరెక్టర్‌ వెంకటస్వామినాయుడు ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమాని రూపొందించారు. నిర్మాత అశోక్‌రెడ్డిగారికి సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ ఎక్కువ. అది వున్న నిర్మాత తప్పకుండా సక్సెస్‌ అవుతారు. సినిమాలో దమ్ముంటే పెద్ద హిట్‌ అవుతుంది. గులాబీమేడలోని సాంగ్స్‌, ట్రైలర్స్‌ చూస్తుంటే సినిమాలో మంచి కంటెంట్‌ వుందనిపిస్తోంది. ఈ సినిమా హిట్‌ అయి నిర్మాత అశోక్‌రెడ్డిగారికి మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

దర్శకుడు బొండా వెంకటస్వామినాయుడు మాట్లాడుతూ - ''అశోక్‌రెడ్డిగారు, నేను ఒక మంచి సినిమా చెయ్యాలని ఎప్పటినుంచో ప్లాన్‌ చేసుకున్నాం. ఒక మంచి కథ కుదరడంతో గులాబీమేడ చిత్రాన్ని రూపొందించాం. లవ్‌, హార్రర్‌ థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని చేశాం. అశోక్‌రెడ్డిగారు ఒక ముఖ్యమైన క్యారెక్టర్‌ చేశారు. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను'' అన్నారు.

నిర్మాత అశోక్‌రెడ్డి మాట్లాడుతూ - ''దర్శకుడు వెంకటస్వామినాయుడు 10 సంవత్సరాలుగా పరిచయం. మొదట చిన్న సినిమా తీసి ప్రూవ్‌ చేసుకోవాలని ఈ సినిమా నిర్మించడం జరిగింది. చిన్న సినిమాగా స్టార్ట్‌ అయినా పెద్ద సినిమా స్థాయిలోనే ఈ చిత్రాన్ని తియ్యడం జరిగింది. నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్‌ చేశాం. ఈ సినిమా పూర్తవడానికి నా మిత్రులు ఎంతో మంది సహకారాన్ని అందించారు. అక్టోబర్‌లో ఈ సినిమాని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

సంగీత దర్శకుడు సాకేత్‌ నాయుడు మాట్లాడుతూ - ''సంగీత దర్శకుడుగా ఇది నాకు ఐదో సినిమా. ఈ చిత్రంలో నాలుగు పాటలు వున్నాయి. ఒక్కో పాట ఒక్కో కాన్సెప్ట్‌తో వుంటుంది. దర్శకుడు వెంకటస్వామినాయుడుగారు నాకు ఎంతో ఫ్రీడమ్‌ ఇచ్చారు. ఇదొక క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ. రీ-రికార్డింగ్‌ చాలా బాగా వచ్చింది. తప్పకుండా ఈ సినిమా సక్సెస్‌ అవుతుంది. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత అశోక్‌రెడ్డిగారికి థాంక్స్‌'' అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.