close
Choose your channels

తెలుగులో రీమేక్ అవుతున్న 'గల్లీ బాయ్'

Wednesday, February 20, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగులో రీమేక్ అవుతున్న గల్లీ బాయ్

ర‌ణ‌వీర్ సింగ్‌, అలియా భ‌ట్ నటీనటులుగా జోయా అక్తర్ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కిన 'గ‌ల్లీబాయ్'. ఈ చిత్రం ఫిబ్రవ‌రి 14న విడుద‌లై ఊహించనంత విజయం సాధించింది. పేరుకే 'గల్లీ బాయ్' అయినప్పటికీ దేశ స్థాయిలో కలెక్షన్ల పరంగా దుమ్ముదులుతున్నాడు. కేవలం 4 రోజుల్లోనే 50 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా ఈ చిత్రానికి ఇండియ‌న్ క్రిటిక్స్, ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం జ‌ర్నలిస్ట్స్ నుంచి కూడా ప్రశంస‌లు అందడం విశేషం.

కథ పరంగా చూస్తే.. ముంబై మురికి వాడల్లో పెరిగిన ఓ యువకుడు.. ఇండియాలోనే టాప్ ర్యాపర్‌గా ఎదిగిన తీరును ఈ మూవీలో చూపించారు. మేరీ గల్లీ, రూట్స్‌లాంటి హిట్ ర్యాప్ సాంగ్స్ సృష్టికర్త అయిన ఇండియన్ ర్యాపర్ డివైన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా సింప్లీ సూపర్బ్ అంతే. అందుకే ఈ సినిమాను పలు బాషల్లో రీమేక్ చేసుకునేందుకు నిర్మాతలు, డైరెక్టర్లు క్యూ కడుతున్నారు.

తెలుగులో 'గల్లీ బాయ్'..

బాలీవుడ్‌‌లో సూపర్ డూపర్ హిట్టయిన ఈ 'గల్లీ బాయ్‌' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సన్నాహాలు చేస్తున్నారు!. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు రీమేక్ హక్కులను సొంతం చేసుకుని మెగా హీరో సాయిధరమ్ తేజ్‌తో తెరపైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో అల్లు అరవింద్ వున్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇందుకు సంబందించి పనులు కూడా మొదలెట్టేశారని టాక్ నడుస్తోంది. కాగా ఇంత వరకూ ఈ వ్యవహారంపై అటు అల్లు అరవింద్ గానీ.. ఇటు తేజ్‌‌గానీ రియాక్ట్ అవ్వలేదు. బాలీవుడ్ హీరో రణవీర్ పాత్రలో నటించనున్నారన్న మాట. ఇదేగానీ నిజమైతే.. కొద్ది రోజులుగా ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న సాయిధ‌ర‌మ్ ఈ రీమేక్ చిత్రంతో పక్కాగా సూపర్ డూపర్‌‌ హిట్‌‌ను తన ఖాతాలో వేసుకోవడం పక్కా అని చెప్పుకోవచ్చు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.