close
Choose your channels

డిఫరెంట్ సస్పెన్స్ థ్లిల్లర్ మాంజ - హీరో దీప్ పాటక్

Monday, October 3, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అవికాగోర్, దీప్ పాట‌క్, ఇషాడియోల్, కార్తిక్ జయరాజ్, అనీష్ బజ్మీ ప్రధాన పాత్రధారులుగా కిషన్ శ్రీకాంత్ దర్శకత్వంలో కన్నడలో ఘనవిజయం సాధించిన చిత్రాన్నిమాంజ టైటిల్ తో తెలుగులో అనువ‌దించారు. రాజ్ కందుకూరి సమర్పణలో భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణరావు ఈ చిత్రాన్నితెలుగు ప్రేక్షకులకు అందించారు. ఇటీవ‌ల మాంజ చిత్రం రిలీజైంది.
ఈ సంద‌ర్భంగా మాంజ చిత్ర హీరో దీప‌ప్ పాట‌క్ మాట్లాడుతూ... డిఫ‌రెంట్ గా ఉండే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ మాంజ‌. 18 సంవ‌త్స‌రాల లోపు వ‌య‌సు ఉన్న ముగ్గురు కుర్రాళ్లు, ఒక అమ్మాయి పోలీసుల‌కు దొరికితే ఎలా ట్రీట్ చేస్తార‌నేది ఈ చిత్రంలో చూపించాం.వాళ్ల‌కి పోలీసుల వ‌ల‌న ఒక పెద్ద క్రైమ్ చేయాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ‌తాయి. ఒక‌సారి త‌ప్పు చేసి క్రిమిన‌ల్ అయినంత మాత్రాన ఎల్ల‌ప్పుడు త‌ప్పు చేస్తార‌నుకోవ‌ద్దు అనే మెసేజ్ కూడా ఈ చిత్రంలో ఉంది. ఈ చిత్రంలో నేను మెకానిక్ విజిగా న‌టించాను. ఢిల్లీలో సివిల్ ఇంజ‌నీరింగ్ చ‌దివాను. ఏక్టింగ్ పై ఇంట్ర‌స్ట్ తో సినిమాల్లోకి రావాల‌ని ప్ర‌య‌త్నించాను. ముంబాయిలోని కాస్టింగ్ డైరెక్ట‌ర్ ద్వారా ఈ సినిమాలో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు కిష‌న్ వెరీ టాలెంటెడ్. ఆయ‌న‌తో వ‌ర్క్ చేయ‌డం అనేది గ్రేట్ ఎక్స్ పీరియ‌న్స్.
ఇక ఈ చిత్రంలో న‌టించిన అవికా ఆల్రెడీ ఫేమ‌స్. ఉయ్యాల జంపాల‌, సినిమా చూపిస్త మావ చిత్రాల‌తో స‌క్సెస్ సాధించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. నేను త‌న‌తో క‌లిసి న‌టించేట‌ప్పుడు కాస్త నెర్వ‌స్ గా ఫీల‌య్యేవాడిని కానీ అవికా చాలా స‌పోర్ట్ చేసి నేను ఎలా న‌టిస్తే బాగుంటుందో స‌ల‌హాలు ఇచ్చేది. దాస‌రి గారు, రాజ్ కందుకూరి గారు, రామ‌స‌త్య‌నార‌ణ గారు...ఈ మూవీ ట్రైల‌ర్ చూసి న‌న్ను అభినందించ‌డం చాలా సంతోషంగా ఉంది. తెలుగు ప్రేక్ష‌కులు అంద‌ర్నీ ఆద‌రిస్తారు.సో.. తెలుగులో మ‌రిన్ని సినిమాల్లో న‌టించాల‌నుకుంటున్నాను అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.