close
Choose your channels

ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ, పదోన్నతులు

Wednesday, May 20, 2020 • తెలుగు Comments

ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ, పదోన్నతులు

కరోనా కష్టకాలంలోనూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్‌ల విషయాలు పలు సంచలన, కీలక, వివాదాస్పద నిర్ణయాలు తీసుకుని ప్రతిపక్షాల నోళ్లలో నానిన వైఎస్ జగన్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే.. ఏపీలో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మొత్తం 16 మందికి స్థాన చలనం కలిగింది.

ఆ 16 మంది ఎవరెవరు..? ఏమిచ్చారు!?

- బీసీ వెల్ఫేర్ స్పెషల్ సీఎస్‌గా కె. ప్రవీణ్ కుమార్
- పర్యాటకం, సాంస్కృతిక శాఖలు : రజత్ భార్గవ్
- క్రీడలు, యువజన సంక్షేమం ప్రిన్సిపల్ సెక్రటరీగా కె. రామ్ గోపాల్
- ఎస్టీ వెల్ఫేర్ సెకట్రరీగా కాంతిలాల్ దండే
- సర్వే, లాండ్ సెటిల్మెంట్స్ డైరెక్టర్‌గా సిద్ధార్థజైన్‌కు అదనపు బాధ్యతలు
- మత్స్యశాఖ కమిషనర్‌గా కన్నబాబుకు అదనపు బాధ్యతలు
- ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా జి. శ్రీనివాసులు
- అనంతపురం జేసీగా (అభివృద్ధి) ఎ.సిరి
- సివిల్ సప్లైస్ డైరెక్టర్‌గా దిల్లీరావు
- శాప్ ఎండీగా సి. రామారావుకు అదనపు బాధ్యతలు
- దేవాదాయశాఖ స్పెషల్ కమిషనర్‌గా పి. అర్జున్ రావు
- సీతంపేట ఐటీడీఏ ఈవోగా చామకూరి శ్రీధర్
- నెల్లూరు మున్సిపల్ కమిషనర్‌గా స్వప్నిల్ దినకర్
- కాకినాడ మున్సిపల్ కమిషనర్‌గా సునీల్ కుమార్ రెడ్డి
- ఫైబర్ నెట్ ఎండీగా ఎం. మధుసూదన్ రెడ్డి
- ఏపీ ఎండీసీ ఎండీ (ఇంచార్జ్)గా వీజీ వెంకట్ రెడ్డిలను బదిలీలు చేస్తూ జగన్ సర్కార్ ఈ మేరకు ఓ జీవోను విడుదల చేసింది. వీరందరూ అత్యవసరంగానే విధుల్లో చేరాల్సి ఉంటుందని కూడా జీవోలో నిశితంగా జగన్ సర్కార్ తెలిపింది.

కాగా ఇటీవలే.. జిల్లా స్థాయిలోని పాలనా యంత్రాంగంలో జగన్ సర్కార్ కీలక మార్పులు చేసింది. జిల్లాలకు అదనంగా మరో జేసీని (జాయింట్ కలెక్టర్‌) ప్రభుత్వం నియమించింది. పరిపాలనా సంస్కరణల్లో భాగంగా ప్రతి జిల్లాకు ఇలా మరో ఐఏఎస్ అధికారిని తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జిల్లా స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగాన్ని పటిష్టం చేసేలా జగన్ సర్కార్ కార్యాచరణ చేస్తోంది. 13 అదనపు జేసీల పోస్టులను ఏర్పాటు చేస్తూ ఈ మేరకు మే-06న ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. తాజాగా పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేయడంతో మరికొందరికి పదోన్నతులు ఇవ్వడం జరిగింది.

Get Breaking News Alerts From IndiaGlitz