close
Choose your channels

బిగ్‌బాస్‌ ఆఫర్‌ను రెండుసార్లు తిరస్కరించిన జోగిని శ్యామల

Saturday, July 13, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్‌ ఆఫర్‌ను రెండుసార్లు తిరస్కరించిన జోగిని శ్యామల

జోగిని శ్యామల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు శ్యామలను పరిచయం చేయనక్కర్లేదు. అయితే ఈ మధ్య బిగ్‌బాస్-3 కంటెస్టెంట్ల వ్యవహారంలో పెద్ద రచ్చ జరుగుతున్న నేపథ్యంలో ఈమె కూడా నోరు విప్పారు. శనివారం నాడు ఓ టీవీ చానెల్‌లో జరిగిన డిబెట్‌లో భాగంగా జోగిని శ్యామల ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు రెండుసార్లు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చినప్పటికీ నో చెప్పానని శ్యామల చెబుతున్నారు. అయితే ఆమె ఎందుకు వద్దనుకున్నారు..? ఆమె నో చెప్పడం వెనుక కారణాలేంటి..? అనే విషయాలు శ్యామల మాటల్లోనే విందాం.

ఒకసారి కాదు రెండుసార్లు!

" ఎస్.. నాకు మొదటి సంవత్సరం.. ఈ ఏడాది రెండుసార్లు ఆఫర్ వచ్చింది. మీరు షోలో ఉంటే బాగుంటుందని నిర్వాహకులు పదే పదే అడిగారు. బయట నాకంటూ కొన్ని ప్రియారిటీలు ఉన్నాయి. వాస్తవానికి నేను హిందీ బిగ్‌బాస్‌కు వీరాభిమానిని. బిగ్‌బాస్ షో గురించి మొత్తం నాకు తెలుసు కాబట్టే నేను వద్దనుకున్నాను. షోలో ఆ గొడవలు ఏ విధంగా ఉంటాయో అందరికీ తెలుసు. షోలో ఉన్నంత వరకూ ఎంత మంచి పొజీషన్‌లో ఉన్నా.. తిరిగొచ్చేటైమ్‌లో కచ్చితంగా చురక అంటించుకొని వస్తాం కాబట్టి అలా చేయడం నాకు ఇష్టం ఉండదు. నాకు ఆ ఫేమ్, నేమ్ అక్కర్లేదు అనుకొని వద్దనుకున్నాను కాబట్టి నేను వెళ్లలేదు" అని శ్యామల చెప్పుకొచ్చారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.