పవనే పెద్ద బోడిలింగం: కొడాలి నాని..
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. తాజాగా పవన్ పంచ్ డైలాగ్‌లతో కొడాలి నానిపై సెటైర్లు వేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కొడాలి నాని పవన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో మంగళవారం జరిగిన పేదలకు ఇల్లు పంపిణీ కార్యక్రమంలో కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవనే పెద్ద బోడి లింగమంటూ ఫైర్ అయ్యారు. తామంతా శివలింగాలం కాబట్టే తమను ప్రజానీకం నెత్తిన పెట్టుకుందని.. పవన్ పెద్ద బోడిలింగం కాబట్టి గాజువాక, భీమవరం ప్రజలు కింద పడేసి తొక్కేశారని విమర్శించారు.
ప్యాకేజీలు తీసుకొని, ఎవరో రాసిన స్క్రిప్టులు చదివే పచ్చకామెర్లు సోకిన యాక్టర్లను ప్రజలు నమ్మరంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటికే ప్రజల తిరస్కారానికి గురైన పవన్.. తన అవివేకానికి నిదర్శనంగా.. సిగ్గు, శరం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. గజదొంగ లాంటి చంద్రబాబు, బోడి లింగం లాంటి పవన్ కల్యాణ్‌లు ఎంతమంది వచ్చినా, దేవుడు ఆశీస్సులు ఉన్నంత కాలం జగన్‌ను ఏం చేయలేరన్నారు. పవన్ తనను తాను వకీల్ సాబ్ అనుకుంటే జనం మరోలా భావిస్తున్నారన్నారు. పవన్ సినిమాలను ఆపాలని ఎవరూ చూడలేదని..తనకు తానే సినిమాలను ఆపేస్తున్నానని గతంలో ప్రకటించారని గుర్తు చేశారు. పవన్‌కు మరోమారు ప్యాకేజీలు అందిన కారణంగానే పర్యటనలు ఉధృతం చేశారని కొడాలి నాని ఎద్దేవా చేశారు.
పవన్ ఏమన్నారంటే...
గుడివాడ, మచిలీపట్నంలలో సోమవారం పవన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని ఏదైనా ప్రశ్నిస్తే.. ఒక్కొక్కరూ బూతులు తిడుతుంటారన్నారు. ‘ఇక్కడున్న ఎమ్మెల్యే పేరేంటి? నానియా? వైసీపీలో నానీలు ఎక్కువమంది ఉన్నారు’ అన్నారు. ఏదో ఒక నాని అని.. ఏ నానియో తనకు అర్థం కావడం లేదన్నారు. శతకోటి లింగాల్లో ఆయనో బోడి లింగం అని పేర్కొన్నారు. పవన్ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.