close
Choose your channels

మెగాస్టార్ మూవీలో న‌టిస్తున్న‌ లేడీ అమితాబ్..

Wednesday, July 13, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. త‌మిళ్ చిత్రం క‌త్తి రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఓ ముఖ్య‌పాత్ర ఉంద‌ట. ఆ పాత్ర‌కు లేడీ అమితాబ్ విజ‌య‌శాంతి అయితే బాగుంటుంద‌ని వినాయ‌క్ అనుకున్నార‌ట‌. ఇదే విష‌యాన్ని వినాయ‌క్ చిరంజీవికి చెబితే...ఓకే అన్నార‌ట‌. దీంతో విజ‌య‌శాంతిని చిత్ర యూనిట్ సంప్ర‌దిస్తే...ఈ చిత్రంలో న‌టించేందుకు విజ‌య‌శాంతి ఇంకా సైన్ చేయ‌లేదు కానీ...పాజిటివ్ గా స్పందించిన‌ట్టు స‌మాచారం.

చిరంజీవి - విజ‌య‌శాంతి జంట ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించారు. అయితే...గ్యాంగ్ లీడ‌ర్ సినిమాలో న‌టిస్తున్న‌ప్పుడు వీరిద్ద‌రికీ డిఫ‌రెన్సెస్ రావ‌డంతో మ‌ళ్లీ క‌లిసి న‌టించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. అప్ప‌టికే మెకానిక్ అల్లుడు సినిమాలో న‌టించేందుకు సైన్ చేయ‌డం వ‌ల‌న ఆ సినిమాలో క‌లిసి న‌టించార‌ట‌. ఆత‌ర్వాత విజ‌య‌శాంతి సినిమాల్లో న‌టించిన‌ప్ప‌టికీ చిరంజీవితో క‌లిసి న‌టించ‌లేదు. ఇప్పుడు చిరు 150వ చిత్రంలో విజ‌య‌శాంతి నటిస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. అన్నీ కుదిరి చిరంజీవి - విజ‌య‌శాంతి క‌లిసి న‌టిస్తే...చిరు 150వ చిత్రానికి మ‌రింత క్రేజ్ రావ‌డం ఖాయం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.