close
Choose your channels

Lokesh:ముగిసిన లోకేశ్‌ సీఐడీ విచారణ.. రేపు మరోసారి రావాలని నోటీసులు

Wednesday, October 11, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి తాడేపల్లి సీఐడీ కార్యాలయంలో జరిగిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విచారణ ముగిసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన లోకేశ్‌.. విచారణలో తనను 50 ప్రశ్నలు అడిగారని.. అందులో ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన ప్రశ్న ఒక్కటి మాత్రమే అడిగారన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డులో తాము అవినీతికి పాల్పడ్డినట్లు తమ కుటుంబం లబ్ది పొందిందని ఎలాంటి ఆధారాలను సీఐడీ వాళ్లు చూపించలేదని తెలిపారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయని రేపు విచారిస్తామని చెప్పారని.. ఈరోజే ఆ ప్రశ్నలు అడగండని కోరినా అంగీకరించలేదని లోకేశ్‌ వెల్లడించారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని పేర్కొ్న్నారు. తమను అడ్డుకునేందుకు దొంగ ఎఫ్ఐఆర్‌లు రూపొందిస్తూ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే చంద్రబాబును అరెటస్ట్ చేశారు..

ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తాము చేసిన నేరమా అని ప్రశ్నించారు. ఇలాంటి తప్పుడు కేసుల్లో తనను అనవసరంగా విచారణకు పిలిచి ఒకరోజంతా వేస్ట్ చేశారన్నారు. దొంగ కేసులు పెట్టారు కాబట్టే పాదయాత్రకు బ్రేక్ వచ్చిందన్నారు. లేదంటే యువగళం పాదయాత్ర చేసుకుంటూ ఉండేవాడినన్నారు. పోలవరం పూర్తి చేయలేదని.. రాజధాని నిర్మించలేదని.. యువతకు ఉద్యోగాలు కల్పించలేదని.. ప్రశ్నిస్తున్నారనే కాబట్టే తమ అధినేత చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు అరెస్టుతో సంబంధం లేదన్న జగన్ వ్యాఖ్యలపై సెటైర్లు..

చంద్రబాబు అరెస్టుతో తనకు సంబంధం లేదని సీఎం జగన్ చెప్పడంపై లోకేశ్‌ సెటైర్లు వేశారు. సీఐడీ ముఖ్యమంత్రి కింద పనిచేస్తోందా.. లేదా..? ఏసీబీ ఎవరికి రిపోర్టు చేస్తుంది? సహజంగానే జగన్‌కి ప్రభుత్వ శాఖలపై అవగాహన కొంచెం తక్కువని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కింద పనిచేసే సీఐడీ అధికారులు ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేసేటప్పుడు సీఎంకు చెప్పకుండా ఉంటారా? అని లోకేశ్ ప్రశ్నించారు. కాగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్‌ను ఏ14గా సీఐడీ చేర్చిన సంగతి తెలిసిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.