close
Choose your channels

విడిపోయాం.. మళ్లీ లవ్ చేసే పెళ్లి చేసుకుంటా! - సందీప్ కిషన్‌

Sunday, August 4, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విడిపోయాం.. మళ్లీ లవ్ చేసే పెళ్లి చేసుకుంటా! - సందీప్ కిషన్‌

నటీనటులు ప్రేమలో పడటం.. విడిపోవడం సహజమే. అయితే కొన్ని ప్రేమ జంటలు పెళ్లి దాకా వెళ్తాయి. మరికొందరైతే ప్రాణాలు తెగించి మరీ రీల్ లైఫ్‌లో లాగానే రియల్ లైఫ్‌లో పెళ్లి పీటలెక్కి పెళ్లి చేసుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా ప్రేమించడం.. విడిపోవడం.. మళ్లీ వేరొకరితో బంధాన్ని సాగించడం లాంటివి ఎక్కువగా బాలీవుడ్‌లో జరుగుతుంటాయి. ఇక టాలీవుడ్ విషయానికొస్తే నటీనటులపై రాని రూమరంటూ లేదు. అలానే ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘నిను వీడని నీడను నేనే’ అనే సూపర్ హిట్ చిత్రాల హీరో సందీప్ కిషన్‌ ప్రేమ వ్యవహారాలపై పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చిన విషయం విదితమే. ఈ వ్యవహారంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో సందీప్ క్లారిటీ ఇచ్చేశారు.

ప్రేమించా.. విడిపోయాం!

"ఎస్.. నేను ప్రేమించిన మాట వాస్తవమే.. సినీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయినే ప్రేమించాను. కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోయాం. మేం విడిపోయి కూడా రెండేళ్లు పూర్తైంది. అయితే ఇప్పుడు మేమిద్దరం స్నేహితులుగా చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఎవరి జీవితాలు వాళ్లకు ఉంటాయి. ఆ అమ్మాయి ఎవరు అని మాత్రం అడగకండి..(నవ్వుతూ)" సందీప్ చెప్పుకొచ్చారు. అయితే ఆ అమ్మాయి ఎవరు..? అనే విషయాన్ని మాత్రం బయటికి చెప్పడానికి సందీప్ సాహసించలేదు. దీంతో ఆయన అభిమానులంతా ఇంతకీ ఆ అందాల భామ ఎవరై ఉంటారబ్బా..? అని ఆలోచనలో పడ్డారు.

మళ్లీ లవ్.. ఆ తర్వాతే పెళ్లి!

అంతటితో ఆగని ఆయన.. మళ్లీ ప్రేమించే పెళ్లి చేసుకుంటానని చెబుతుండటం గమనార్హం. అంతేకాదు.. పెద్దలు కుదిర్చిన సంబంధాలంటే అస్సలు ఇష్టం లేదని చెబుతున్నాడు. తనకు స్వతంత్ర భావాలున్న మహిళలంటే చాలా గౌరవం.. ఇష్టం అని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే తన లైఫ్‌లోకి వచ్చే అమ్మాయికి ఎలాంటి లక్షణాలు ఉండాలో కూడా సందీప్ చెప్పాడు. ‘నా జీవితంలోకి వచ్చే అమ్మాయికి నాకంటే ఎక్కువ తెలుసుండాలి. నాకు ఎప్పుడూ ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉండాలి’ అని తెలిపాడు. ఇంతకీ ఈయనకు ఇన్ని లక్షణాలున్న అమ్మాయి ఎక్కడ దొరుకుతుందో..? ఎక్కడ ఉందో..? ఎప్పుడు సందీప్ లవ్ చేస్తాడో..? ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటాడో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.