'మామ మంచు అల్లుడు కంచు' ఆడియో సక్సెస్ మీట్...

  • IndiaGlitz, [Sunday,December 20 2015]

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రమ్యకృష్ణ, మీనా, అల్లరి నరేష్, పూర్ణ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం మామమంచు..అల్లుడు కంచు'. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ పై మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్ రెడ్డి తీర్చిదిద్దారు. కోటి, అచ్చు, రఘుకుంచె సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదలై మంచి సక్సెస్ ను సాధించింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ తిరుపతిలోనెహ్రు నగర పాలక ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డా.మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్, అల్లరి నరేష్, అలీ, డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, కోటి, రఘుకుంచె, ఎంపీ శివప్రసాద్, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకలో...

డా.మోహన్ బాబు మాట్లాడుతూ 'సినిమా నటీనటులకు సినిమాయే ఊపిరి, భోజనం. క్రమశిక్షణ, నిజాయితీ కారణంగానే ఈ స్థాయికి చేరుకున్నాను. తిరుపతి దివంగత ఎమ్మెల్యే వెంకట రమణతో కలిసి నాటకాలు వేశాను. గోలీలు ఆడాను. మరాఠిలో విజయవంతమైన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశాం. సినిమా వందరోజుల వేడుకును కూడా ఇక్కడే నిర్వహిస్తాం'' అన్నారు.

అల్లరి నరేష్ మాట్లాడుతూ 'మోహన్ బాబుగారి వంటి సీనియర్ నటుడుతో నటించడం వల్ల ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ప్లానింగ్ పక్కాగా ఉండటంతో సినిమాను 40 రోజుల్లో పూర్తి చేశాం. సినిమాను డిసెంబర్ 25న విడుదల చేస్తున్నాం'' అన్నారు.

అలీ మాట్లాడుతూ 'మోహన్ బాబు గారు గొప్ప నటులు. 560 చిత్రాలకు పైగా నటించడం, 60 చిత్రాలను నిర్మించడం ఆయనకే చెల్లింది. సినిమా అవుటండ్ అవుట్ ఎంటర్ టైన్మెంట్ తో సాగుతుంది'' అన్నారు.

మోహన్ బాబు సినీ రంగ ప్రవేశం చేసి 40 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా కుటుంబ సభ్యుల సమక్షంలో వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలో ఆయన అభిమానులు కూడా పాల్గొన్నారు.

నటీనటులు : డా.మోహన్ బాబు, నరేష్, రమ్యకృష్ణ, మీనా, పూర్ణ, వరుణ్ సందేశ్, అలీ, కృష్ణభగవాన్, జీవా, రాజా రవీంద్ర, సోనియా, సురేఖా వాణి, హృదయ, మౌనిక, ధనరాజ్, చమ్మక్ చంద్ర , ఖయ్యూమ్, సాయి పంపాన, చిట్టిబాబు, అనంత్, సత్తెన్న, దాసన్న, అంబటి శీను

టెక్నిషియన్స్ : మాటలు: శ్రీదర్ సీపాన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత్ శ్రీరామ్, శ్రీమణి, డ్యాన్స్: రాజు సుందరం, బృంద, శ్రీధర్, విద్యాసాగర్, ఆర్ట్: చిన్నా, ఎడిటర్: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: బాలమురుగన్, సంగీతం: అచ్చు, కోటి, రఘకుంచె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ కుమార్, సమర్పణ: అరియానా, వివియానా, విధ్యానిర్వాణ, నిర్మాత: విష్ణు మంచు, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి.

More News

'ఎక్స్ ప్రెస్ రాజా' ఆడియో విడుదల

శర్వానంద్, సురభి జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ , ప్రమోద్ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఎక్స్ ప్రెస్ రాజా.

చ‌ర‌ణ్ మూవీకి ముహుర్తం ఫిక్స్

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌ని ఓరువ‌న్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు.

రంగ‌నాథ్ వంటి ఆద‌ర్శ‌వంత‌మైన వ్య‌క్తిని కోల్పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం : బాల‌కృష్ణ‌

న‌టులు రంగ‌నాథ్‌గారు ఇలా ఆక‌స్మికంగా మ‌ర‌ణించ‌డం అనేది బాధాక‌రం. న‌న్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఆది పుట్టినరోజు 23న 'గ‌రమ్' ఆడియో

లవ్లీ రాక్ స్టార్ ఆది హీరోగా, మదన్ దర్శకత్వంలో శ్రీమతి వసంత శ్రీనివాస్ సమర్పణలో శ్రీనివాసాయి స్ర్కీన్స్ పతాకంపై పి.సురేఖ నిర్మించిన చిత్రం 'గరం'.

బాల‌య్య‌తో ఎన్టీఆర్ గొడ‌వ స‌మ‌సిపోనుందా...

గ‌త కొన్ని బాబాయ్ బాల‌య్య‌, అబ్బాయి ఎన్టీఆర్‌ల మ‌ధ్య సైలెంట్ వార్ న‌డుస్తుంది. ఇది కాద‌న‌లేని విష‌యం.