close
Choose your channels

'మామ మంచు అల్లుడు కంచు' ఆడియో సక్సెస్ మీట్...

Sunday, December 20, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రమ్యకృష్ణ, మీనా, అల్లరి నరేష్, పూర్ణ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం మామమంచు..అల్లుడు కంచు`. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ పై మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్ రెడ్డి తీర్చిదిద్దారు. కోటి, అచ్చు, రఘుకుంచె సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదలై మంచి సక్సెస్ ను సాధించింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ తిరుపతిలోనెహ్రు నగర పాలక ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డా.మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్, అల్లరి నరేష్, అలీ, డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, కోటి, రఘుకుంచె, ఎంపీ శివప్రసాద్, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకలో...

డా.మోహన్ బాబు మాట్లాడుతూ `సినిమా నటీనటులకు సినిమాయే ఊపిరి, భోజనం. క్రమశిక్షణ, నిజాయితీ కారణంగానే ఈ స్థాయికి చేరుకున్నాను. తిరుపతి దివంగత ఎమ్మెల్యే వెంకట రమణతో కలిసి నాటకాలు వేశాను. గోలీలు ఆడాను. మరాఠిలో విజయవంతమైన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశాం. సినిమా వందరోజుల వేడుకును కూడా ఇక్కడే నిర్వహిస్తాం`` అన్నారు.

అల్లరి నరేష్ మాట్లాడుతూ `మోహన్ బాబుగారి వంటి సీనియర్ నటుడుతో నటించడం వల్ల ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ప్లానింగ్ పక్కాగా ఉండటంతో సినిమాను 40 రోజుల్లో పూర్తి చేశాం. సినిమాను డిసెంబర్ 25న విడుదల చేస్తున్నాం`` అన్నారు.

అలీ మాట్లాడుతూ `మోహన్ బాబు గారు గొప్ప నటులు. 560 చిత్రాలకు పైగా నటించడం, 60 చిత్రాలను నిర్మించడం ఆయనకే చెల్లింది. సినిమా అవుటండ్ అవుట్ ఎంటర్ టైన్మెంట్ తో సాగుతుంది`` అన్నారు.

మోహన్ బాబు సినీ రంగ ప్రవేశం చేసి 40 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా కుటుంబ సభ్యుల సమక్షంలో వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలో ఆయన అభిమానులు కూడా పాల్గొన్నారు.

నటీనటులు : డా.మోహన్ బాబు, నరేష్, రమ్యకృష్ణ, మీనా, పూర్ణ, వరుణ్ సందేశ్, అలీ, కృష్ణభగవాన్, జీవా, రాజా రవీంద్ర, సోనియా, సురేఖా వాణి, హృదయ, మౌనిక, ధనరాజ్, చమ్మక్ చంద్ర , ఖయ్యూమ్, సాయి పంపాన, చిట్టిబాబు, అనంత్, సత్తెన్న, దాసన్న, అంబటి శీను

టెక్నిషియన్స్ : మాటలు: శ్రీదర్ సీపాన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత్ శ్రీరామ్, శ్రీమణి, డ్యాన్స్: రాజు సుందరం, బృంద, శ్రీధర్, విద్యాసాగర్, ఆర్ట్: చిన్నా, ఎడిటర్: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: బాలమురుగన్, సంగీతం: అచ్చు, కోటి, రఘకుంచె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ కుమార్, సమర్పణ: అరియానా, వివియానా, విధ్యానిర్వాణ, నిర్మాత: విష్ణు మంచు, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.