close
Choose your channels

రవితేజలాగే నాగచైతన్య కి కూడా..

Tuesday, May 17, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప‌న్నెండేళ్ల క్రితం ర‌వితేజ ఓ ఫీల్‌గుడ్ ల‌వ్‌స్టోరీ చేశాడు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు అదే ఫ్లేవ‌ర్‌తో యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య కూడా ఓ ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీ చేస్తున్నాడు. అప్పుడు ర‌వితేజ చేసినా.. ఇప్పుడు చైత‌న్య చేసినా ఇద్ద‌రివీ రీమేక్ స‌బ్జెక్ట్‌లే. ఇంత‌కీ ఆ సినిమాలేంటో ఈ పాటికే అర్థ‌మై ఉంటుంది. అవును.. ఆ చిత్రాలే 'నా ఆటోగ్రాఫ్‌', 'ప్రేమ‌మ్‌'. త‌మిళంలో ఘ‌న‌విజ‌యం సాధించిన 'ఆటోగ్రాఫ్‌'ని తెలుగులో ర‌వితేజ 'నా ఆటోగ్రాఫ్' (2004) పేరుతో రీమేక్ వెర్ష‌న్ చేశాడు. ఈ సినిమా ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోయినా ర‌వితేజ ప్ర‌య‌త్నానికి మార్కులు ప‌డ్డాయి.

మ‌ళ్లీ 'ఆటోగ్రాఫ్‌'లాంటి ల‌వ్ ఫెయిల్యూర్స్ నేప‌థ్యంలో మ‌ల‌యాళంలో రూపొందిన ఇండ‌స్ట్రీ హిట్‌ 'ప్రేమ‌మ్‌'ని అదే పేరుతో నాగ‌చైత‌న్య రీమేక్ చేస్తున్నాడు. జులై నెల‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌ల‌యాళంలో లాగే ఇక్క‌డ కూడా విజ‌యం సాధిస్తుందో లేదో అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇదిలా ఉంటే.. 'నా ఆటోగ్రాఫ్' సంగ‌తి తీసుకున్నా.. 'ప్రేమ‌మ్' (తెలుగు) సంగ‌తి తీసుకున్నా ఓ అంశం కామ‌న్‌గా క‌నిపిస్తోంది.

అదేమిటంటే.. 'నా ఆటోగ్రాఫ్' లో ఒరిజ‌న‌ల్‌లో మెయిన్ రోల్ చేసిన స్నేహ పాత్ర‌లో భూమిక న‌టించ‌గా.. ఇత‌ర పాత్ర‌ల్లో ఒరిజ‌న‌ల్‌లో న‌టించిన గోపిక‌, మ‌ల్లిక‌, క‌నిక తెలుగులోనూ న‌టించారు. ఇక 'ప్రేమ‌మ్' విష‌యానికి వ‌స్తే ఒరిజ‌న‌ల్‌లో మెయిన్ రోల్ చేసిన సాయిప‌ల్ల‌వి పాత్ర‌లో శ్రుతి హాస‌న్ న‌టిస్తుండ‌గా.. ఇత‌ర పాత్ర‌ల్లో ఒరిజ‌న‌ల్‌లో న‌టించిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, మ‌డోన్నా సెబాస్టియ‌న్ ఇక్క‌డా యాక్ట్ చేస్తున్నారు. మ‌రి 'నా ఆటోగ్రాఫ్‌'కి అంత‌గా క‌లిసి రాని ఈ అంశం.. 'ప్రేమ‌మ్‌'కైనా క‌లిసొస్తుందో లేదో మ‌రి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.