close
Choose your channels

ఆర్జీవీ పై నాగబాబు తాజా హాట్ కామెంట్స్ ఇవీ...

Friday, February 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆర్జీవీ పై నాగబాబు తాజా హాట్ కామెంట్స్ ఇవీ...

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు.. మెగా ఫ్యామిలీకి పచ్చగడ్డేస్తే భగ్గుమనేంతగా పరిస్థితులున్నాయన్న విషయం విదితమే. ఎప్పట్నుంచే వర్మకు-మెగా ఫ్యామిలీకి మధ్య వైరం ఉంది. గతంలో వివాదాస్పద నటి శ్రీరెడ్డి వ్యవహారంలో.. అది కాస్త మరింత ముదిరింది. ఒకానొక సందర్భంలో మెగా బ్రదర్స్‌ గురించి వరుస ఆయన వరుస ట్వీట్స్ చేయడం.. ఆ తర్వాత మెగాభిమానుల నుంచి ఆగ్రహావేశాలకు గురికావడం.. వరుసగా పవన్ కల్యాణ్, నాగబాబు స్పందించి చీవాట్లు పెట్టడం ఇవన్నీ జరిగిపోయాయి. అయితే ఎందుకు గొడవలొచ్చాయి..? ఏ విషయంలో..? అనే విషయాలు ఇక్కడ అప్రస్తుతం అయితే ఆర్జీవీ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ గురించి తాజాగా మెగా బ్రదర్, జబర్దస్త్ కింగ్ నాగబాబు ఓ ఇంటర్వ్యూలో హాట్ కామెంట్స్ చేశారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ కచ్చితంగా చూస్తా..!

ఇప్పటి వరకూ వచ్చిన ‘కథానాయకుడు’, ‘యాత్ర’ బయోపిక్‌‌లు తాను చూడలేదన్నారు. అయితే ఆర్జీవీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ బాగుంటుందని నమ్మకం ఉందన్నారు. కచ్చితంగా సినిమా చూస్తానన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఎన్టీఆర్‌‌ గురించి చెప్పాల్సివస్తే సినిమా పరంగా ఆయనది సక్సెస్‌‌‌ఫుల్ లైఫ్.. ఎలాంటి ఒడిదుడికులు లేవు కానీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాతే కొన్ని కష్టాలొచ్చాయని.. అయితే ఈ పాయింట్‌‌ను ఆర్జీవీ తీసుకున్నాడు గనుక కచ్చితంగా సినిమా బాగుంటున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు.

ఆర్జీవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు..

"నాకు రామ్ గోపాల్ వర్మ అంటే నాకు వ్యక్తిగతంగా గౌరవం లేదు. ఆయనపై ఇప్పుకామెంట్ కూడా చేయదలచుకోలేదు. కానీ ఒక దర్శకుడిగా ఆయనకు గౌరవం ఇస్తాను. ఆయన ఎబిలిటీని ఎప్పుడూ తప్పుబట్టలేం. ఆర్జీవీ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో మంచి పాయింట్ తీసుకున్నాడు. సినిమాపై నాకు నమ్మకముంది" అని నాగబాబు చెప్పుకొచ్చారు. కాగా ఇప్పటికే రిలీజయిన ట్రైలర్ అశేష ఆదరణ పొందిన సంగతి తెలిసిందే.

ఆర్జీవీ సినిమా గురించి పొగడ్తల వర్షం కురిపించిన నాగబాబు.. ఆయన వ్యక్తిత్వంపై ఎందుకిలా మాట్లాడారని పలువురు వర్మ అభిమానులు, సినీ ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తనను విమర్శించినా.. ప్రశంసించినా కచ్చితంగా రియాక్టయ్యే ఆర్జీవీ.. నాగబాబు వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.