close
Choose your channels

సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ని ఓ ఆట ఆడుకున్న ఆర్జీవీ

Saturday, April 3, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ని ఓ ఆట ఆడుకున్న ఆర్జీవీ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. కాస్త వెరైటీగా కామెడీగా ఫోటో లేదంటే వీడియో కనిపిస్తే చాలు.. ఆయన చాలా సెటైరికల్‌గా స్పందించి పెద్ద వివాదానికి తెరదీస్తారు. సినీ ప్రముఖుల నుంచి ప్రముఖ రాజకీయ నాయకుల వరకూ ప్రతి ఒక్కరూ ఆయన ధాటికి అల్లాడాల్సిందే. మళ్లీ ఏం మాట్లాడితే ఏం వస్తుందోనని.. ఆర్జీవీ కామెంట్ చేసినా లైట్ తీసుకుని కిమ్మనకుండా ఉండిపోతారు. తాజాగా ఆయన ఓ యువనేతపై ట్విటర్ వేదికగా సెటైర్లు వేశారు.

యువనేతను టార్గెట్ చేయడమే కాదు.. దానికి ఓ వీడియోను కూడా జత చేశారు. ఆ యువనేత మరెవరో కాదు.. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహారావు తనయుడు, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుఫున పోటీ చేస్తున్న నోముల భగత్. ట్విటర్‌లో ఆయనను ఆర్జీవీ ఓ ఆట ఆడేసుకున్నారు. భగత్ ఒక పులితో సరదాగా వాకింగ్ వెళ్తున్న వీడియోను ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఒక పెంపుడు శునకాన్ని దాని గొలుసు పట్టుకొని తీసుకెళ్తున్నట్లుగా అవలీలగా భగత్ ఆ పులిని పట్టుకొని వెళ్తుండడం ఆశ్యర్యాన్ని కలిగిస్తోంది. నిజానికి అది కుక్కను తీసుకెళుతున్న వీడియోనే. కానీ భగత్ అభిమానులు దానిని చిరుతగా మార్ఫింగ్ చేశారు.

ఈ వీడియో ఎలా చిక్కిందో కానీ.. వర్మకు చిక్కింది. దీనిపై ఆర్జీవీ వరుసగా రెండు ట్వీట్లు చేశారు. ‘‘వామ్మో.. కేసీఆర్, కేటీఆర్‌లు టైగర్‌, సింహాలని మనకు తెలుసు. కానీ, ఇలా నోముల భగత్ చిరుత పులిని వాకింగ్‌కి తీసుకెళ్తుండడం నాకెంతో నచ్చింది. ఒకవేళ నాకే కనుక నాగార్జున సాగర్‌లో ఓటు హక్కు ఉంటే 17వ తేదీన నా ఓటు ఈ రియల్ హీరోకే వేసేవాణ్ని’’ అంటూ ట్వీట్ చేశారు. మరో ట్వీట్‌లో.. ‘‘ఈ అభ్యర్థి నోముల భగత్ ‘నేను అంటే, టీఆర్ఎస్‌కు ఓటు వేయండి. నాగార్జున సాగర్‌లో మన గర్జనకు ఏ ఒక్క పార్టీ నిలవలేదు’ అంటున్నారు. కానీ, నేను ఇలా చిరుత పులితో కలిసి ప్రచారంలో పాల్గొంటున్న వ్యక్తిని ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. హ్యాట్సాఫ్ కేసీఆర్, కేటీఆర్’’ అని మరో ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు ఓ రేంజ్‌లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.