close
Choose your channels

నాని.. అదే డైరెక్ట‌ర్, నిర్మాత‌తో జ‌ట్టు

Saturday, February 8, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నాని.. అదే డైరెక్ట‌ర్, నిర్మాత‌తో జ‌ట్టు

నేచుర‌ల్ స్టార్ నాని వ‌రు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. రీసెంట్‌గానే త‌న 25వ సినిమా `వి`ను పూర్తి చేశాడో లేదో ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా త‌న 26వ సినిమాకు రెడీ అయిపోయాడు. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో `ట‌క్ జ‌గ‌దీష్‌` సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయ్యి అవ‌గానే రాహుల్ సంక్రిత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమా ఇంకా స్టార్ట్ కానే లేదు. అప్పుడు నాని త‌న 28వ సినిమాను ట్రాక్ ఎక్కించే ప‌నిలో బిజీగా ఉన్నాడ‌ట‌. వివ‌రాల్లోకెళ్తే నాని 28వ సినిమాను నిర్మాత దిల్‌రాజుతో చేయ‌బోతున్నాడ‌ని టాక్‌. డైరెక్ట‌ర్ త్రినాథ‌రావు న‌క్కిన ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్నాడ‌ట‌.

నాని, త్రినాథ‌రావు న‌క్కిన‌, దిల్‌రాజు కాంబినేష‌న్‌లో ఇది వ‌ర‌కు నేను లోక‌ల్ సినిమా విడుద‌లై ఘ‌న విజ‌యాన్ని సాధించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా త‌ర్వాత త్రినాథ రావు న‌క్కిన వెంకటేశ్‌తో ఓ పోలీస్ సినిమా చేయాల‌నుకున్నాడు. కానీ ఎందుక‌నో ఆ సినిమా చివ‌రి నిమిషంలో ఆగిపోయింది. దాంతో త్రినాథ‌రావు న‌క్కిన దిల్‌రాజుని కలిసి క‌థ‌ను వినిపించాడ‌ట‌. త‌ర్వాత నానికి కూడా న‌చ్చింద‌ట‌. దాంతో నాని ఓకే చెప్పాడు కానీ.. ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాల‌ను పూర్తి చేసిన త‌ర్వాతే నాని ఈ సినిమాను ట్రాక్ ఎక్కిస్తాడు. అప్ప‌టి వ‌ర‌కు త్రినాథ‌రావుకు ఎదురుచూపులు త‌ప్పేలా లేవు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.