close
Choose your channels

శివాజీ రాజా కుంభకోణాలు బయటపెట్టిన నరేశ్!

Saturday, March 16, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శివాజీ రాజా కుంభకోణాలు బయటపెట్టిన నరేశ్!

‘మా’ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన నరేశ్.. ఇంతక మునుపు టెర్మ్‌లో ఉన్న శివాజీ రాజా బాగోతాన్ని బయటపెట్టారు. శనివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించారు.

నరేశ్ మాటల్లోనే..

"గత టెర్మ్‌లో అవకతవకలు జరిగాయని చెప్పాను. రెండు సంవత్సరాల ఆడియో రికార్డ్‌ మాయమైపోయిందని చెప్పాను. ఇవన్నీ చెప్పకూడదనుకున్నాను కానీ.. మీడియా అడుగుతోంది కాబట్టి చెబుతున్నాను. నాకు అన్ని విషయాలు తెలియవచ్చాయి. (ఫైలును చూపిస్తూ..) ఇది లైఫ్ ఇన్సూరెన్స్ ఫైల్.. ‘మా’లోని సభ్యులెవరైనా చనిపోతే రూ. 2లక్షలిచ్చి క్లెయిమ్ చేయాలి.. కానీ చేయలేదు. ఇది వ్యాలిడిటీ అయిపోయిందప్పుడే. ఇది ‘మా’ మీద.. ఆయన మీద గౌరవంతో బయటపెట్టకూడదనుకున్నాను. మనుషుల ప్రాణాలతో ఆడటం కరెక్టేనా..? ఇదిగో ఆధారాలు చూస్కోండి. ఇలాంటివి చాలానే ఉన్నాయి. కుర్చీ పిచ్చి మాకు లేదు. అలాగే కొన్ని చెక్స్‌పై సంతకం పెట్టమంటే పెట్లేదు.. మేం పెట్టమని చెప్పేశారు. ఇలాంటివి చాలానే ఉన్నాయి. నేను చెప్పకూడదు.. చెప్పలేను కూడా. ‘మా’ ఇంటి గుట్టుకోసం అవన్నీ నేను బయటికి తీయను" అంటూ ఒక్కొక్కటిగా ఆయన కుంభకోణాలు బయటపెట్టారు.

ఎందుకిలా చేస్తున్నారు..!?

ఎందుకింతలా హింసపెడుతున్నారు. మేం ఏం పాపం చేశాము. మార్పుకావాలని మేం కోరాం. అరుణాచలం వెళ్లిపోతానన్న నువ్వు ఇక్కడిక్కడే తిరుగుతూ ఈ పదిరోజుల్లో కొన్ని డిస్‌క్వాలిఫై చేయాలని భావిస్తున్నారు. కొంతమంది మెంబర్స్‌‌ను ఎత్తుకెళ్లడం జరిగింది. అవన్నీ ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు కూడా నీకు ఎందుకు ఇన్ని ఓట్లు వచ్చాయి..? రీ కౌంటింగ్ పెట్టించు అని చెప్పి ఆపాలని ప్రయత్నిస్తున్నాడు. మీడియా సమావేశం ఆరోగ్యకరమైన వాతావరణంలో మా ఎన్నికలు జరిగాయి. నరేష్ ప్యానెల్ 22న బాధ్యతలు చేపట్టాలని ముహుర్తం చూసుకున్నాం.

మాజీ అధ్యక్షుడు శివాజీరాజా మార్చి 31 వరకు గడువు ఉందంటూ కోర్టుకు వెళ్తానని చెప్పాడు. పెండింగ్‌లో ఉన్న చెక్కులపై పూర్వ సభ్యులు సంతకాలు పెట్టడానికి ముందుకు రావడం లేదు. మా అసోసియేషన్‌లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. శివాజీరాజా కోసం మేల్కొని ఓట్లు లెక్కింపునకు సహకరించాం" అని నటుడు నరేశ్ చెప్పుకొచ్చారు.

శివాజీ రాజా కుంభకోణాలు బయటపెట్టిన నరేశ్!

`మా` ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ డా.రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ - ``నాకు గ‌తంలో ఏం జరిగిందో తెలియ‌దు.. పాత క‌థ‌లు వ‌ద్దు, కొత్త క‌థ‌లు వ‌ద్దు.. అన్నీ ప‌క్క‌న పెట్టేస్తాం. ఇప్పుడు మ‌మ్మ‌ల్ని ప‌నిచేయ‌డానికి అనుమ‌తించండి. ఇలా అడ్డంకులు పెట్ట‌డం .. ఆక‌తాయి గేమ్స్ ఆడుకోవ‌డం ఎవ‌రికీ మంచిది కాదు.. అంద‌రం క‌లిసి అన్నీ ప‌నులు చేసుకుందామ‌నే ముందు నుండి చెబుతూ వ‌స్తున్నాం. ఇది ఒక ప్యానెల్‌లోని స‌భ్యుల వ‌ల్ల కాదు. క‌మిటీలు వేసి అంద‌రం క‌లిసి ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఉంది. అన్నీ మ‌రచిపోతాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఉన్న‌తికి పాటుప‌డుదాం`` అన్నారు.

`మా` జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ జీవితా రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ - "అస‌లు `మా` ఎన్నిక‌లకు వెళ్ల‌డ‌మే షేమ్‌గా అనిపించింది. స‌రే! స‌మ‌స్య‌లు వ‌చ్చాయి క‌దా! అని ఎన్నిక‌ల‌కు వెళ్లాం. సరే జ‌రిగిన విష‌యాల‌ను మ‌ర‌చిపోదాం అనుకుని ముందుకెళ‌దామ‌ని అనుకున్నాం. మేం గెలిచాం.. వారు ఓడిపోయారు. ఎన్నిక‌లు త‌ర్వాత ఇలా ఇబ్బందులు పెడుతున్నారెందుకో అర్థం కావ‌డం లేదు. నేను గెలిచిన త‌ర్వాత కూడా నా ఎలిజిబిలిటీ గురించి కూడా ప్ర‌శ్నిస్తున్నారు. అంద‌రం క‌లిసి ప‌నిచేయాల‌నే అనుకుంటున్నాం. మాకు స‌మ‌స్య‌లు వ‌ద్దు. `మా`కు మంచి జ‌ర‌గాల‌నే అనుకున్నాం. ఆల్ రెడి న‌ష్టం జ‌రిగింది. `మా`లో ఉన్న‌వాతావ‌ర‌ణాన్నితెలియ‌జేయ‌డానికి మీడియా ముందుకు వ‌చ్చాం. ప‌దిరోజుల త‌ర్వాత మ‌మ్మ‌ల్ని వ‌ర్క్ చేయ‌మ‌న్నా మాకేం అభ్యంత‌రం లేదు. అయితే అన్నీ ప‌నులు ఎందుకు ఆగిపోవాలి. పోనీ పాత క‌మిటీవాళ్లు ప‌నులు చేస్తామంటే.. మాకెలాంటి అభ్యంత‌రం లేదు. మా పెద్ద‌లు కూడా మేం క‌రెక్ట్ అనే అంటున్నారు.

అయితే ఈ సంచలన ఆరోపణలపై శివాజీ రాజా నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.