close
Choose your channels

‘నాట్యం’ టీజర్: నాట్యం అంటే ఒక కథను అందంగా చెప్పడం

Wednesday, February 10, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘నాట్యం’ టీజర్: నాట్యం అంటే ఒక కథను అందంగా చెప్పడం

ప్ర‌ముఖ కూచిపూడి నృత్య‌కారిణి సంధ్య‌రాజు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం `నాట్యం`. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి రేవంత్ కోరుకొండ దర్శకుడిగానే కాకుండా స్క్రిప్టు, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఉపాసన విడుదల చేశారు. ఈ ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. యంగ్ టైగర్ ఎన్టీయార్ ట్విటర్ ద్వారా ఈ టీజర్‌ను కొద్ది సేపటి క్రితం విడుదల చేశాడు.

‘నాట్యం అంటే ఒక కథను అందంగా చెప్పడం’ అనే డైలాగ్‌తో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. ఈ టీజర్‌ ఆద్యంతం నాట్యం, శాస్త్రీయ సంగీతం నేపథ్యంలో సాగింది. నాట్యం యొక్క ప్రాధాన్యతను వెల్లడించారు. ఈ సినిమా టీజర్ చూస్తుంటే మరో ‘సాగరసంగమం’ను ప్రేక్షకులకు చూపించాలనే తపన కనిపించింది. మరి ఈ రోజుల్లో ఇలాంటి సినిమా చేయడమంటే ఒక సాహసమనే చెప్పాలి. ‘నాట్యం’తో కలిపి ఒక లవ్ స్టోరీని అద్భుతంగా తెరకెక్కించారు కాబట్టి ఆదరణ బాగా దక్కే అవకాశముందని తెలుస్తోంది. నిశృంక‌ల ఫిల్స్మ్ బ్యాన‌ర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి రేవంత్ కోరుకొండ డైరెక్ట‌ర్. డైరెక్షన్ మాత్రమే కాదు.. క‌మ‌ల్‌కామ‌రాజు, రోహిత్ బెహ‌ల్, శుభలేఖ సుధాకర్ భానుప్రియ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.