ఫిబ్రవరి 3న 'నేను లోకల్'

  • IndiaGlitz, [Friday,January 20 2017]

ఇడియ‌ట్‌, ఆర్య వంటి డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్ బేస్‌డ్ ల‌వ్ స్టోరీస్ ఎంత పెద్ద స‌క్సెస్‌ను సాధించాయో తెలిసింది. ఇప్పుడు నాని హీరోగా, కీర్తిసురేష్ హీరోయిన్‌గా, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో త్రినాథ రావు నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో శిరీష్ నిర్మాత‌గా రూపొందుతోన్న క్యారెక్ట‌ర్ బేస్డ్ ల‌వ్ స్టోరీ 'నేను లోక‌ల్‌'.'యాటిట్యూడ్ ఈస్ ఎవిరీథింగ్‌' అనేది క్యాప్ష‌న్‌. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పాట‌లు ఇటీవ‌ల విడుద‌లైన సంగ‌తి తెలిసిందే

మా 'నేను లోకల్' సినిమా ఫిబ్ర‌వ‌రి 3న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. సినిమా చాలా బాగా వ‌చ్చింది. మూవీ త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంది. ఈ స‌క్సెస్‌తో నాని సెకండ్ హ్యాట్రిక్ కొడ‌తాడు. కేర‌క్ట‌ర్‌ బేస్‌డ్ ల‌వ్‌స్టోరీస్ ఉన్న ఇడియ‌ట్‌, ఆర్య సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అలాంటి కేర‌క్ట‌ర్ బేస్డ్ ల‌వ్‌స్టోరీతో తెర‌కెక్కిన చిత్ర‌మిది. యాటిట్యూడ్ ఈజ్ ఎవిరీథింగ్ అనే క్యాప్ష‌న్ పెట్టాం. ఇటీవ‌ల విడుద‌ల చేసిన పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. నెక్స్ట్ ఏంటి? అనే పాట కుర్ర‌కారుకు చాలా బాగా న‌చ్చింది. లోక‌ల్ గురించిన పాట కూడా చాలా పెద్ద స‌క్సెస్ అయింది. దేవిశ్రీ ప్ర‌తి పాట‌కూ చాలా మంచి ట్యూన్ ఇచ్చారు. ర‌చ‌యిత‌లు చ‌క్క‌గా రాశారు.

ఒక్క‌సారి విన‌గానే మ‌ళ్లీ మ‌ళ్లా పాడుకునేలా ఉన్నాయ‌ని నాతో చాలా మంది అన్నారు. నాని నేచుర‌ల్ పెర్‌ఫార్మ‌ర్‌. ఇందులో ద‌ బెస్ట్‌గా న‌టించాడు. కీర్తి ఈ సినిమాలో మంచి రోల్ చేసింది.ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు చ‌క్క‌గా తెర‌కెక్కించారు. నాని యాక్టింగ్‌, కీర్తి సురేష్ గ్లామ‌ర్‌, టేకింగ్ అన్నీ సినిమాలో హైలైట్ అవుతాయ‌ని నిర్మాత దిల్‌రాజు తెలిపారు. ఫిబ్ర‌వ‌రి 3న మంచు విష్ణు ల‌క్కున్నోడు కూడా విడుద‌ల కానుంది. రాజ్‌కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎం.వి.వి.సత్యనారాయ‌ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.

More News

మెగాస్టార్ కి గ్రాండ్ పార్టీ ఇచ్చిన టిఎస్సార్..!

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 150వ చిత్రం ఖైదీ నెం150 ప్ర‌పంచ వ్యాప్తంగా రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి 10 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ న‌టించ‌డం..

జల్లికట్టు నిషేధం దక్షిణాది కల్చర్ పై దాడి - పవన్ కళ్యాణ్..!

తమిళనాడులో జల్లికట్టు పై సుప్రీం కోర్టు నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయం చేయాలంటూ తమిళనాడు

'నక్షత్రం' షూట్ కు బ్రేక్ పడిందా...?

సాయిధరమ్ తేజ్,సందీప్ కిషన్,ప్రగ్యా జైశ్వాల్,రెజీనా నటిస్తూ కృష్ణవంశీ దర్శకత్వలో తెరకెక్కుతోన్న చిత్రం నక్షత్రం.

పవన్ కల్యాణ్ మూవీ రిలీజ్ డేట్ ..?

పవర్స్టార్ పవన్ కల్యాణ్,స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే.

జూన్ లో మహేష్....?

సూపర్స్టార్ మహేష్ బాబుహీరోగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఎన్.వి.ప్రసాద్,