close
Choose your channels

పవన్ కల్యాణ్ మూవీ రిలీజ్ డేట్ ..?

Friday, January 20, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీ రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం కాట‌మ‌రాయుడు సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ప‌వ‌న్ కల్యాణ్ ఫిబ్ర‌వ‌రిలోనే త‌న కొత్త సినిమాను ప్రారంభిస్తాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ సినిమాకు దేవుడే దిగివ‌చ్చినా..అనే టైటిల్ కూడా విన‌ప‌డుతుంది.

అయితే సాధార‌ణంగా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ను చ‌క్క‌గా తెర‌కెక్కిస్తాడ‌ని త్రివిక్ర‌మ్‌కు పేరుంది. కానీ ప‌వ‌న్‌తో రూపొందించ‌బోయే సినిమా పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ అని, త‌న పంథాను మార్చి విభిన్నంగా తెర‌కెక్కించ‌నున్న ఈ సినిమాను ఆగ‌స్ట్ 11న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలుస్తుంది. సినిమా స్టార్ట్ కాక‌ముందే రిలీజ్ డేట్ గురించి ప‌వ‌న్, త్రివిక్ర‌మ్ క్లారిటీతోనే ఉన్నారు. ఈ సినిమాలో ప‌వ‌న్ స‌ర‌స‌న కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయ‌ల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.