close
Choose your channels

ఫిబ్రవరి 3న 'నేను లోకల్'

Friday, January 20, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇడియ‌ట్‌, ఆర్య వంటి డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్ బేస్‌డ్ ల‌వ్ స్టోరీస్ ఎంత పెద్ద స‌క్సెస్‌ను సాధించాయో తెలిసింది. ఇప్పుడు నాని హీరోగా, కీర్తిసురేష్ హీరోయిన్‌గా, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో త్రినాథ రావు నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో శిరీష్ నిర్మాత‌గా రూపొందుతోన్న క్యారెక్ట‌ర్ బేస్డ్ ల‌వ్ స్టోరీ `నేను లోక‌ల్‌`.`యాటిట్యూడ్ ఈస్ ఎవిరీథింగ్‌` అనేది క్యాప్ష‌న్‌. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పాట‌లు ఇటీవ‌ల విడుద‌లైన సంగ‌తి తెలిసిందే

మా `నేను లోకల్` సినిమా ఫిబ్ర‌వ‌రి 3న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. సినిమా చాలా బాగా వ‌చ్చింది. మూవీ త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంది. ఈ స‌క్సెస్‌తో నాని సెకండ్ హ్యాట్రిక్ కొడ‌తాడు. కేర‌క్ట‌ర్‌ బేస్‌డ్ ల‌వ్‌స్టోరీస్ ఉన్న ఇడియ‌ట్‌, ఆర్య సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అలాంటి కేర‌క్ట‌ర్ బేస్డ్ ల‌వ్‌స్టోరీతో తెర‌కెక్కిన చిత్ర‌మిది. యాటిట్యూడ్ ఈజ్ ఎవిరీథింగ్ అనే క్యాప్ష‌న్ పెట్టాం. ఇటీవ‌ల విడుద‌ల చేసిన పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. నెక్స్ట్ ఏంటి? అనే పాట కుర్ర‌కారుకు చాలా బాగా న‌చ్చింది. లోక‌ల్ గురించిన పాట కూడా చాలా పెద్ద స‌క్సెస్ అయింది. దేవిశ్రీ ప్ర‌తి పాట‌కూ చాలా మంచి ట్యూన్ ఇచ్చారు. ర‌చ‌యిత‌లు చ‌క్క‌గా రాశారు.

ఒక్క‌సారి విన‌గానే మ‌ళ్లీ మ‌ళ్లా పాడుకునేలా ఉన్నాయ‌ని నాతో చాలా మంది అన్నారు. నాని నేచుర‌ల్ పెర్‌ఫార్మ‌ర్‌. ఇందులో ద‌ బెస్ట్‌గా న‌టించాడు. కీర్తి ఈ సినిమాలో మంచి రోల్ చేసింది.ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు చ‌క్క‌గా తెర‌కెక్కించారు. నాని యాక్టింగ్‌, కీర్తి సురేష్ గ్లామ‌ర్‌, టేకింగ్ అన్నీ సినిమాలో హైలైట్ అవుతాయ‌ని నిర్మాత దిల్‌రాజు తెలిపారు. ఫిబ్ర‌వ‌రి 3న మంచు విష్ణు ల‌క్కున్నోడు కూడా విడుద‌ల కానుంది. రాజ్‌కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎం.వి.వి.సత్యనారాయ‌ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.