ఎన్టీఆర్ ట్విట్టర్ అకౌంట్ హ్యక్ అయిందా?

  • IndiaGlitz, [Tuesday,December 22 2015]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా అప్పుడ‌ప్పుడు త‌న అభిమానుల‌కు చిన్న చిన్న మెసేజ్‌లు ఇస్తుంటాడు. నిన్న సోమవారం తార‌క్ ట్విట్ట‌ర్ అకౌంట్ నుండి వ‌చ్చిన ఓ మెసేజ్ అభిమానులు, చిత్ర‌యూనిట్‌ను షాక్‌కు గురిచేసింద‌ట‌. వివ‌రాల్లోకెళ్తే..నిన్న రాత్రి తార‌క్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా చాలా మంది అభిమానులు నాన్న‌కు ప్రేమ‌తో ఆడియో రిలీజ్ డేట్‌, మూవీ రిలీజ్ డేట్ గురించి అడుగుతున్నారు. 'అయితే అదెప్పుడో నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే వాటి గురించి నాకు కూడా తెలియ‌డం లేదు' అని మెసేజ్ వ‌చ్చింది. దాంత్ కంగు తిన్న అంద‌రూ ఆ విష‌యాన్ని తార‌క్ దృష్టికి తీసుకెళ్ళారు. అయితే తాన‌లా చేయ‌లేద‌ని చెప్పుకునే ప్ర‌య‌త్నం చేసిన తార‌క్, ఏం జ‌రిగిందో క‌నుక్కుంటాన‌ని ట్విట్ల‌ర్ ద్వారానే తెలియ‌జేశాడు. జ‌రిగేదంతా చూస్తుంటే తార‌క్ అకౌంట్‌ను ఎవ‌రో హ్య‌క్ చేసిన‌ట్టు క‌న‌ప‌డుతుంది.

More News

సొగ్గాడు సాంగ్స్ రిలీజ్ కి డేట్ ఫిక్స్...

కింగ్ నాగార్జున నటిస్తూ...నిర్మించిన తాజా చిత్రం సొగ్గాడే చిన్ని నాయనా.ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు కళ్యాణ్ క్రిష్ణ తెరకెక్కిస్తున్నారు.

రొటీన్ కు భిన్నంగా చేసిన చిత్రమే 'నేను..శైలజ' - రామ్

కృష్ణచైతన్య సమర్పణలో స్రవంతి మూవీస్ బ్యానర్పై రూపొందుతోన్న చిత్రం నేను..శైలజ.రామ్,కీర్తి సురేష్ లు జంటగా నటించిన ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్ నిర్మించారు.

రజనీకాంత్ మూవీ ఆప్ డేట్...

సూపర్ స్టార్ రజనీకాంత్ రెండు సినిమాలను వరుసగా లైన్ లో పెట్టాడు.అందులో ఒకటి ‘మహాదేవ్’(తమిళంలో కబాలి).అలాగే శంకర్ దర్శకత్వంలో రోబో సీక్వెల్ ‘2.0’.

'నాన్నకు ప్రేమతో' ఆడియో రిలీజ్ డేట్...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'నాన్నకు ప్రేమతో'.ఈ చిత్రం కోసం తారక్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు.

మంచు మనోజ్ హీరోగా ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై నూతన చిత్రం

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై నూతన చిత్రం ప్రారంభం కానుంది.