close
Choose your channels

ఎన్టీఆర్ ట్విట్టర్ అకౌంట్ హ్యక్ అయిందా?

Tuesday, December 22, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా అప్పుడ‌ప్పుడు త‌న అభిమానుల‌కు చిన్న చిన్న మెసేజ్‌లు ఇస్తుంటాడు. నిన్న సోమవారం తార‌క్ ట్విట్ట‌ర్ అకౌంట్ నుండి వ‌చ్చిన ఓ మెసేజ్ అభిమానులు, చిత్ర‌యూనిట్‌ను షాక్‌కు గురిచేసింద‌ట‌. వివ‌రాల్లోకెళ్తే..నిన్న రాత్రి తార‌క్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా చాలా మంది అభిమానులు నాన్న‌కు ప్రేమ‌తో ఆడియో రిలీజ్ డేట్‌, మూవీ రిలీజ్ డేట్ గురించి అడుగుతున్నారు. `అయితే అదెప్పుడో నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే వాటి గురించి నాకు కూడా తెలియ‌డం లేదు` అని మెసేజ్ వ‌చ్చింది. దాంత్ కంగు తిన్న అంద‌రూ ఆ విష‌యాన్ని తార‌క్ దృష్టికి తీసుకెళ్ళారు. అయితే తాన‌లా చేయ‌లేద‌ని చెప్పుకునే ప్ర‌య‌త్నం చేసిన తార‌క్, ఏం జ‌రిగిందో క‌నుక్కుంటాన‌ని ట్విట్ల‌ర్ ద్వారానే తెలియ‌జేశాడు. జ‌రిగేదంతా చూస్తుంటే తార‌క్ అకౌంట్‌ను ఎవ‌రో హ్య‌క్ చేసిన‌ట్టు క‌న‌ప‌డుతుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.