close
Choose your channels

మంచు మనోజ్ హీరోగా ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై నూతన చిత్రం

Monday, December 21, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై నూతన చిత్రం ప్రారంభం కానుంది. కరెంట్ తీగ` వంటి హిట్ తర్వాత శౌర్య వంటి మరో డిఫరెంట్ సినిమాలో నటిస్తున్న మంచు మనోజ్ తన స్టయిల్లో నెక్ట్స్ చేయనున్న కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇది. రవితేజతో మిరపకాయ్`, బాలకృష్ణతో శ్రీమన్నారాయణ`, నానితో పైసా` వంటి డిఫరెంట్ మూవీస్ ను నిర్మించి నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నిర్మాత రమేష్ పుప్పాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఎన్నో కమర్షియల్ చిత్రాలకు సంగీతాన్నందించిన యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. మనోజ్,థమన్ కాంబినేషన్ లో రానున్న తొలి చిత్రం కూడా ఇదే కావడం విశేషం. రచన, స్క్రీన్ ప్లేను కిషోర్ సమకూరుస్తున్న ఈ చిత్రానికి సాగర్ పసల దర్శకత్వం వహిస్తున్నారు. కమర్షియల్ ఫార్మెట్ లో మనోజ్ ను సరికొత్త రీతిలో ప్రెజెంట్ చేసేలా ఈ చిత్రం ఉంటుంది. ఖర్చుకు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మిస్తాం. ఈ సినిమాకు సంబంధించిన నటీనటుటు, టెక్నిషియన్స్ త్వరలోనే ప్రటిస్తామని చిత్ర నిర్మాత రమేష్ పుప్పాల తెలియజేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.