close
Choose your channels

పేపర్ బాయ్ సినిమా చిత్రీకరణ పూర్తి

Tuesday, June 19, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పేపర్ బాయ్ సినిమా చిత్రీకరణ పూర్తి

సంపత్ నంది టీమ్‌వర్క్స్‌, ప్రచిత్ర క్రియేషన్స్, బి.ఎల్.ఎన్ సినిమా పతాకాలపై సంపత్ నంది, వెంకట్, నరసింహ నిర్మించిన సినిమా ‘పేపర్ బాయ్’. సంతోష్ శోభన్, ప్రియా శ్రీ, తన్య హోప్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి జయశంకర్ దర్శకత్వం వహించారు. టాకీపార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందించబడుతోంది. హైదరాబాద్, ముంబాయి, లోనవాల, పూణే, కేరళ, గోవా వంటి నగరాల్లో ఈ సినిమా తెరకెక్కింది. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని జులై లో విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. డైరెక్టర్ సంపత్ నంది పుట్టినరోజు సంధర్బంగా జూన్ 20న "పేపర్ బాయ్" ఫస్ట్ లుక్ ను విడుదల కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.