close
Choose your channels

ప్రధాని మరో కీలక ప్రకటన చేయబోతున్నారా..!?

Thursday, April 2, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రధాని మరో కీలక ప్రకటన చేయబోతున్నారా..!?

రోనాపై యుద్ధంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మరో కీలక ప్రకటన చేయబోతున్నారా..? లాక్‌డౌన్ విషయంలో ప్రధాని సంచలన ప్రకటన చేయబోతున్నారా..? ఇంతకీ మోదీ మనసులో ఏముంది..? రేపు అనగా ఏప్రిల్-03న ఉదయం 9 గంటలకు మోదీ ఏం చెప్పబోతున్నారు..? అనేదానిపై దేశ ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ‘జనతా కర్ఫ్యూ’, ‘లాక్‌డౌన్’ లాంటి కీలక ప్రకటన అనంతరం ప్రధాని మోదీ శుక్రవారం ఉదయం 09 గంటలకు ఓ వీడియో రూపంలో తన సందేశాన్ని దేశ ప్రజలతో పంచుకోనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా మోదీ పంచుకున్నారు. అయితే.. మన్ కీ బాత్‌లో ఆయన లాక్ డౌన్ గురించి చర్చించినా, ఈసారి నేరుగా ప్రజల ముందుకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

వాట్ నెక్స్ట్!

గురువారం నాడు ఈరోజు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రాల ప్రభుత్వాలు ఏమేం చర్యలు తీసుకున్నాయ్..? ఇంకా మున్ముంథు ఎలాంటి చర్యలు చేపట్టాలి..? దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ పరిస్థితి ఎలా ఉంది..? రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎందుకు పెరుగుతోంది..? ఢిల్లీలోని నిజాముద్ధీన్ ఘటనపై ఎలా ముందుకెళ్లాలి..? ఇందులో ఏమైనా కుట్ర దాగుందా..? అనేదానిపై ఇవాళ నిశితంగా చర్చించారు కానీ మీడియా ముందుకు మాత్రం ముఖ్యమంత్రులు కానీ.. ప్రధాని కానీ రాలేదు. రేపు వీడియో సందేశం ఇస్తామని సోషల్ మీడియాలో చెప్పడంతో ఆయన నోటి నుంచి ఏం ప్రకటన రాబోతోంది..? కీలక ప్రకటన చేయబోతున్నారా..? అనేదానిపై ప్రజల్లో ఒకింత ఆసక్తి.. మరోవైపు టెన్షన్ కూడా నెలకొంది. ఆ ప్రకటన ఏదో తెలియాలంటే రేపు ఉదయం 09 గంటల వకూ వేచి చూడక తప్పదు మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.