సింగర్‌గా మారిన ప్రియా ప్రకాశ్ ?
Send us your feedback to audioarticles@vaarta.com
మలయాళ చిత్రం `ఒరు ఆడార్ లవ్`లో కన్నుగీటే సన్నివేశంతో నేషనల్ రేంజ్లో పాపులారిటీ సంపాదించుకుంది ప్రియాప్రకాశ్వారియర్. అయితే ఒరు ఆడార్ లవ్ ప్లాప్ కావడంతో అవకాశాలు తగ్గిపోయాయి. బాలీవుడ్లో `శ్రీదేవి బంగ్లా` అనే సినిమాతో పాటు తెలుగులో నితిన్, చంద్రశేఖర్ ఏలేటి సినిమాలో నటిస్తుంది. ఈమె హీరయినే కాదు.. మంచి గాయని అని కూడా అంటున్నారు. ఎందుకంటే ఈరోజు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్చేసిన వీడియో చూసి అందరూ ఆమెను మంచి గాయని అని ప్రశంసిస్తున్నారు.
ఇంతకు ప్రియా ప్రకాశ్ వారియర్ పోస్ట్ చేసిన వీడియోలో ఏముంది? అంటే మలయాళంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీలో ఓ సాంగ్‌ను సింగర్ నరేశ్ అయ్యర్‌తో కలిసి పాడింది ప్రియాప్రకాశ్. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మరి భవిష్యత్‌లో ప్రియా ప్రకాశ్‌ను సింగర్‌గా కూడా మనం మరిన్ని సినిమాల్లో చూడొచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.