close
Choose your channels

‘జాతి రత్నాలు’ దర్శకుడికి లంబోర్గిని కారును గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రొడ్యూసర్లు

Saturday, April 3, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘జాతి రత్నాలు’ దర్శకుడికి లంబోర్గిని కారును గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రొడ్యూసర్లు

నవీన్‌ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు చేసిన చిత్రం ‘జాతి రత్నాలు’. మార్చి నెలలో వీరంతగా నవ్వించిన వారు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాతలకు కాసుల పంట పండించింది. ముందుగా ఈ చిత్రం ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల్లోకి బాగా వెళ్లిపోయింది. దీంతో ఈ సినిమా రిలీజ్‌కు ఒక రోజు ముందుగానే టికెట్లన్నీ సేల్ అయిపోయాయి. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా.. సినిమా సైతం బాగా ఎంటర్‌టైన్ చేసింది.

థియేటర్‌లోకి అడుగు పెట్టిన ప్రేక్షకులు సినిమా చూస్తున్నంతసేపు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించి బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రతి సన్నివేశం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గతంలో కూడా అనుదీప్ సినిమాలు చేసినప్పటికీ ఆయన గురించి ప్రేక్షకులకు తెలియదు. కానీ ‘జాతి రత్నాలు’తో అనుదీప్ ప్రేక్షకులకు బాగా దగ్గరై పోయారు. సినిమా మంచి సక్సెస్ సాధించడంతో అనుదీప్‌కు స్వప్నా సినిమా బ్యానర్‌ అదిరిపోయే గిప్ట్‌ ఇచ్చింది.

ప్రొడ్యూసర్స్‌ స్వప్న దత్‌, ప్రియాంక దత్‌లు కాస్ట్‌లీ లంబోర్గిని కారును అనుదీప్‌కు బహుమతిగా ఇచ్చారు. లంబోర్గిని కారు గురించి ఒకప్పుడైతే పెద్దగా ఎవరికీ తెలిసేది కాదేమో కానీ తాజాగా ఆ కారును ప్రభాస్ కొనడంతో దాని గురించి అందరికీ తెలిసిందే. అంత కాస్ట్లీ కారును నిర్మాతలు.. అనుదీప్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారా? అని ఆశ్చర్యం వేస్తోందా? అయితే ఇది నిజమైన కారు కాదులెండి.. లంబోర్గిని మోడల్‌లోని ఓ బొమ్మకారును అనుదీప్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీనిపై సెటైర్స్ ఓ రేంజ్‌లో పడుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.