close
Choose your channels

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణం.. మార్కెట్లోకి విడుదలైన ప్యూర్ EV ఈప్లూటో 7G మ్యాక్స్

Friday, October 6, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణం.. మార్కెట్లోకి విడుదలైన ప్యూర్ EV ఈప్లూటో 7G మ్యాక్స్

ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో దూసుకుపోతున్న ప్యూర్ ఈవీ సంస్థ కొత్తగా ఈప్లూటో 7G మ్యాక్స్ స్కూటీని విడుదల చేసింది. ఎన్నో ప్రత్యేకతలతో ఈ స్కూటీ మార్కెట్లోకి రిలీజ్ అయినట్లు కంపెనీ చెబుతోంది. కేవలం ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 201 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందని వెల్లడించింది. రెట్రో-థీమ్‌తో వస్తున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.14లక్షలుగా పేర్కొంది. హిల్-స్టార్ట్ అసిస్ట్, డౌన్‌హిల్ అసిస్ట్, కోస్టింగ్ రీజెన్, రివర్స్ మోడ్ వంటి ప్రత్యేకలు ఉన్నట్లు తెలిపింది. ఎలక్ట్రిక్ మోటార్‌ కనెక్ట్ చేయ‌టంతో సరికొత్త రైడింగ్ అనుభూతి ఇస్తుందని చెప్పింది.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణం.. మార్కెట్లోకి విడుదలైన ప్యూర్ EV ఈప్లూటో 7G మ్యాక్స్

ముందుగా బుక్ చేసుకున్న వారికి అందుబాటులోకి..

మ్యాట్ బ్లాక్, రెడ్, గ్రే, వైట్ రంగుల్లో ఈ స్కూటీ అందుబాటులో ఉండనుంది. ఇప్పటికే భారత్ వ్యాప్తంగా ఈ స్కూటర్ బుకింగ్స్ ఓపెన్ చేసింది కంపెనీ. పండుగ సీజన్‌లో విడుదల చేస్తున్న నేపథ్యంలో ఈ స్కూటర్‌కు గిరాకీ ఎక్కువగా ఉంటుందని.. అందుకే ముందుగా బుక్ చేసుకున్న వారికి స్కూటర్ అందజేస్తామంది. ఈ స్కూట‌ర్‌కి క‌నెక్ట్ చేసిన ఎలక్ట్రిక్ మోటార్‌కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన AIS-156-సర్టిఫైడ్ 3.5 kWh లిథియం- అయాన్ స్మార్ట్ బ్యాటరీ అమర్చడం వల్ల 3.21bhp మేర‌ అత్యధిక‌ శక్తినందిస్తుంది. దీంతో ఈ స్కూట‌ర్ మ‌రింత మెరుగ్గా భార‌త్ ర‌హ‌దారుల‌పై రయ్ రయ్‌మంటూ దూసుకెళ్లడం ఖాయంగా చెబుతున్నారు కంపెనీ నిర్వాహ‌కులు.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణం.. మార్కెట్లోకి విడుదలైన ప్యూర్ EV ఈప్లూటో 7G మ్యాక్స్

60వేల కిలోమీటర్ల వారంటీ..

అలాగే రైడింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ మరింత పెంచ‌డానికి మొత్తం మూడు రకాల రైడింగ్ మోడ్‌లు అందిస్తున్నామని తెలిపారు. రోజుకు కనీసం 100 కిలోమీటర్లు ప్రయాణించే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఈ స్కూటర్ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు ఈ EV స్కూటర్‌కి 60వేల‌ కిలోమీటర్ల వారంటీ కూడా అందిస్తున్నారు. అలాగే 70వేల‌ కిలోమీటర్ల వారంటీ కూడా అందుబాటులో ఉందని నిర్వాహకులు చెబుతున్నారు.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణం.. మార్కెట్లోకి విడుదలైన ప్యూర్ EV ఈప్లూటో 7G మ్యాక్స్

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.