‘లైగర్’ రిలీజ్ డేట్ ఫిక్స్... రౌడీ హీరో ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా ఇచ్చిన మేకర్స్

  • IndiaGlitz, [Thursday,December 16 2021]

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘‘లైగర్’’. అనన్య పాండే హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, పూరి జగన్నాథ్, ఛార్మి, అపూర్వా మెహతా నిర్మిస్తున్నారు. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ‘‘లైగర్’’లో కీలకపాత్ర పోషిస్తున్నారు. కోవిడ్ , లాక్‌డౌన్‌ల కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే అప్పుడెప్పుడో ఫస్ట్‌లుక్, మైక్ టైసన్‌తో ఫోటోలు రిలీజ్ చేయకపోవడంతో రౌడీ హీరో అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

దీంతో ‘లైగర్’ సినిమా నుంచి డబుల్ ధమాకాగా రెండు అప్ డేట్స్ ఇచ్చారు మేకర్స్. ఒకటి ‘లైగర్’ సినిమా రిలీజ్ డేట్.. సినిమాను వచ్చే ఏడాది ఆగస్ట్ 25న విడుదల చేస్తామని ప్రకటించేశారు. ఇక రెండో అప్ డేట్ విషయానికి వస్తే.. న్యూఇయర్ కానుకగా డిసెంబర్ 31న ‘లైగర్’ నుంచి గ్లింప్స్‌ను విడుదల చేస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను స‌రికొత్త లుక్‌, క్యారెక్ట‌రైజేష‌న్‌తో పూరి త‌న‌దైన స్టైల్లో సిల్వ‌ర్ స్క్రీన్‌పై ప్రెజంట్ చేస్తున్నారు. ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. లైగర్ ద్వారా బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే .. టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనుంది.

More News

బిగ్‌బాస్ 5 తెలుగు: హమీదా విషయంలో బయటపడ్డ శ్రీరామ్.. మానస్ సోప్‌లు వేస్తాడన్న షన్నూ

బిగ్‌బాస్ 5 తెలుగులో టాప్ 5 నిలిచిన కంటెస్టెంట్స్‌లు ఇప్పటి వరకు హౌస్‌లో వారి జర్నీలు చూపిస్తూ వస్తున్నారు.

లావణ్య త్రిపాఠి బర్త్‌డే స్పెషల్‌గా ఆమె నటిస్తోన్న‘హ్యాపీ బర్త్‌డే’ టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల

‘మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో

హిందీ ‘‘పుష్ప’’కు సెన్సార్ బోర్డ్ షాక్.. ఎలా గట్టెక్కుతారో..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’.

'యశోద'లో కీలక పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్

సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 14గా శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్న సినిమా 'యశోద'.

బిగ్‌బాస్ 5 తెలుగు: హైలైట్ జర్నీ అతడిడే, సన్నీ కంటతడి... మచ్చా లవ్యూ అంటూ ఎమోషనల్

బిగ్‌బాస్ 5 తెలుగు తుది అంకానికి చేరుకుంది. మరో నాలుగు రోజుల్లో ఈ సీజన్ విజేత ఎవరో తేలిపోనుంది.