close
Choose your channels

హిందీ ‘‘పుష్ప’’కు సెన్సార్ బోర్డ్ షాక్.. ఎలా గట్టెక్కుతారో..?

Wednesday, December 15, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. డైరెక్టర్ సుకుమార్ కు, చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ కు కూడా ఇదే తొలి పాన్ ఇండియా లెవల్ సినిమా. గతంలో విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్’ను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయాలని భావించిన మైత్రీ మూవీ మేకర్స్ తర్వాత యూటర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న దక్షిణాది నాలుగు భాషలతో పాటు హిందీలో ఒకేసారి ‘‘పుష్ప’’ను రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. విడుదలకు ముందు ‘పుష్ప’ సినిమాకు బిగ్ షాక్ తగిలింది. ఈ సినిమా హిందీ వెర్షన్‌‌కు సెన్సార్ నిరాకరించింది. ఊహకు మించి హైప్ వచ్చిన నేపథ్యంలో సెన్సార్ సమస్యలు తలెత్తడం ఫాన్స్, నిర్మాతలతో పాటు అందరిని షాక్ కు గురి చేస్తోంది.

సినిమాను ఒక భాషలో తీసి ఐదు భాషల్లో డబ్బింగ్ చెప్పించడం అంటే మాటలు విషయం కాదు. ఈ విషయంలోనే నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నట్లుగా ఫిలింనగర్ టాక్. అన్ని భాషల్లో ది బెస్ట్ ఇవ్వాలని భావించిన దర్శక నిర్మాతలు… ఔట్ పుట్ విషయంలో రాజీ పడకపోవడంతో… అనుకున్న సమయం కంటే ప్రతి స్థాయిలోనూ ఆలస్యం జరుగుతూ వచ్చింది. తెలుగు వర్షన్ సెన్సార్ కూడా ఒకటికి రెండు సార్లు వాయిదా వేసి చివరకు ఎలాగోలా అయ్యిందనిపించినట్లు టాక్. అయితే… వేరే భాషల వర్షన్స్‌ను కూడా రా మెటీరియల్‌తోనే సెన్సార్ చేయించాలని చూసిన యూనిట్‌పై సెన్సార్ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు టాక్. హిందీ వెర్షన్‌కు సంబంధించి పూర్తి స్థాయి ప్రింట్ తోనే సెన్సార్ చేస్తామని స్పష్టం చేసింది.

ఇక.. పుష్పలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ నటిస్తుండగా.. అనసూయ, సునీల్, ధనుంజయ్, రావు రమేశ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ స్పీడ్ పెంచింది. ఇప్పటికే పాటలు, పోస్టర్ల ద్వారా సినిమాపై హైప్ పెంచారు. గత సోమవారం విడుదలైన ట్రైలర్‌, నిన్న బయటకొచ్చిన సమంత ఐటెం సాంగ్‌తో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.