close
Choose your channels

బిగ్‌బాస్ 5 తెలుగు: హమీదా విషయంలో బయటపడ్డ శ్రీరామ్.. మానస్ సోప్‌లు వేస్తాడన్న షన్నూ

Thursday, December 16, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ 5 తెలుగు: హమీదా విషయంలో బయటపడ్డ శ్రీరామ్.. మానస్ సోప్‌లు వేస్తాడన్న షన్నూ

బిగ్‌బాస్ 5 తెలుగులో టాప్ 5 నిలిచిన కంటెస్టెంట్స్‌లు ఇప్పటి వరకు హౌస్‌లో వారి జర్నీలు చూపిస్తూ వస్తున్నారు. ఇప్పటికే శ్రీరామచంద్ర, షణ్ముఖ్, సన్నీ, మానస్‌ల జర్నీలు చూపించడం వారి ఎమోషనల్ అవ్వడం తెలిసిందే. ఇక మిగిలిన ఒకే ఒక్క కంటెస్టెంట్ సిరికి సంబంధించిన జర్నీని కూడా చూపించాడు బిగ్‌బాస్. మరి ఆమె గురించి ఏం చూపించారో.. దానికి సిరి ఎలా రియాక్ట్ అయ్యిందో..? హౌస్‌లో ఇంకేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.

బిగ్‌బాస్ 5 తెలుగు: హమీదా విషయంలో బయటపడ్డ శ్రీరామ్.. మానస్ సోప్‌లు వేస్తాడన్న షన్నూ

టాస్క్‌లు, గేమ్‌లు లేకపోవడంతో కంటెస్టెంట్స్‌కు బోర్ కొడుతూ వుంటుంది. ఏం చేయాలో పాలు పోక దాగుడుమూతలు ఆడుకున్నారు. సన్నీ తన ఎమోషనల్ జర్నీ గురించి చెప్పాడు. బిగ్ బాస్ ఇచ్చిన కేకును తెచ్చి మిగతా హౌస్‌మేట్స్‌తో పంచుకున్నాడు. కాసేపు ఆడుకున్న తర్వాత మానస్‌ -సన్నీ ముచ్చట్లు పెట్టుకున్నారు. శ్రీరామ్‌ ఆట తనకు నచ్చదని మానస్ చెప్పాడు. అన్నీ ఆలోచించి ఆడతాడని కామెంట్ చేశాడు. అనంతరం సిరికి బిగ్‌బాస్ నుంచి కబురు వచ్చింది. గార్డెన్‌ ఏరియాలో ఆమెకు జర్నీని చూపించారు. ఫోటోలు చూసుకుని సిరి ఆనందానికి అవుధుల్లేకుండా పోయింది.

బిగ్‌బాస్ 5 తెలుగు: హమీదా విషయంలో బయటపడ్డ శ్రీరామ్.. మానస్ సోప్‌లు వేస్తాడన్న షన్నూ

‘‘సిరి.. బిగ్ బాస్ ఇంట్లో అందరి కంటే ముందుగా ప్రయాణం మొదలుపెట్టారు. అల్లరి పిల్లగా.. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తుండే సిరిగా మీరు అందరికీ పరిచయం. మీకు మీరుగా సిరి అంటే ఏమిటో ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేశారు. బిగ్ బాస్ ఇంటి మొదటి కెప్టెన్‌గా మొదలైన ప్రయాణం.. ఎన్నో మలుపులు తిరిగింది. మీ పోటీదారులు మీ కంటే బలంగా ఉన్నా.. గివ్ అప్ ఇవ్వకుండా మీ తెలివి తేటలు, ధైర్యంతో చివరి వరకు ఉండటానికి చేసిన ప్రయత్నం ఎందరినో మెప్పించింది. కానీ, ఎన్నోసార్లు.. ఎమోషనల్‌తో కన్నీరు పెట్టుకున్నారు. మీ నవ్వుల మధ్య మీ కన్నీళ్లు కనుమరుగయ్యాయి. పిట్ట కొంచెం కూత ఘనం అనే మాట మీ విషయంలో నిజమని అందరికీ నిరూపించారు. సిరి మీ అల్లరి బిగ్ బాస్ ఇంటికే కళను తీసుకొచ్చింది. ఈ ఇంట్లో మీకు దగ్గరైన బంధాలు మీ మనసుకు ఎప్పటికీ దగ్గరగానే ఉంటాయనేది మీరు పోరాడే తీరు తెలియజేస్తుంది’’ అని బిగ్ బాస్ తెలిపాడు. అనంతరం సిరి ఆరు ఫొటోలను తీసుకెళ్లిపోయింది. అయితే షన్నుతో ఉన్న రొమాంటిక్ ఫొటోను మాత్రం టేబుల్ మ్యాట్ కింద దాచి పెట్టింది. అయితే ఆ ఫోటోను బిగ్ బాస్ పట్టుకెళ్లిపోయాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: హమీదా విషయంలో బయటపడ్డ శ్రీరామ్.. మానస్ సోప్‌లు వేస్తాడన్న షన్నూ

ఆ తర్వాత సిరి, షన్ను ముచ్చట్లు పెట్టుకుంటూ మానస్ గురించి చెప్పుకున్నారు..అతడు మనకు చెబుతున్నాడు కంటెంట్ గురించి అని షన్ను అన్నాడు. హెల్ప్‌లు చేయడాలన్నీ సోప్ వేయడాలు. అవన్నీ మనల్ని పడేయడానికే... అతడు చాలా హెల్ప్ చేస్తాడు. వీళ్లంతా అతడిని తప్పుగా అనుకుంటారని జనాలు అనుకోవాలని చేస్తాడు. అందుకే నేను వారికి ఆ ఛాన్స్ ఇవ్వను అని షన్ను చెప్పాడు. ఆ తర్వాత గార్డెన్‌ ఏరియాలో సన్నీ, శ్రీరామ్‌, మానస్‌, షణ్ముఖ్‌, సిరిలకు సంబంధించిన కొన్ని మెమరబుల్‌ ఫోటోలను ఉంచాడు బిగ్‌బాస్. వాటిలో ఒకదానిని సెలెక్ట్ చేసుకుని ఆ ఫోటో గురించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడంతో పాటు ఆ ఫోటోని బిగ్‌బాస్‌కి ఇస్తూ దానిపై తమ సందేశాన్ని రాయాల్సి ఉంటుంది.

బిగ్‌బాస్ 5 తెలుగు: హమీదా విషయంలో బయటపడ్డ శ్రీరామ్.. మానస్ సోప్‌లు వేస్తాడన్న షన్నూ

తొలుత మానస్‌ ... టెడ్డీబేర్‌ టాస్కులో గెలిచినప్పుడు నేను, సన్నీ, యానీ మాస్టర్‌ను సంతోషంతో ఎత్తుకున్నాం.. అంటూ ఆ ఫొటోను బిగ్‌బాస్‌కిచ్చాడు. షణ్ముఖ్‌ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ జర్నీలోనే బాధాకరమైన విషయం అమ్మ లెటర్‌ ముక్కలు కావడం అంటూ దానికి సంబంధించిన ఫొటోను బోర్డుపై పెట్టాడు. సిరి మాట్లాడుతూ.. ‘‘బ్రిక్స్‌ ఛాలెంజ్‌ను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని చెప్పింది. ఆ టాస్క్‌కు ముందే షన్నును ఫేక్‌ ఫ్రెండ్‌ అన్నానని.. అది తప్పని బ్రిక్స్‌ ఛాలెంజ్‌ టాస్క్‌లో అతను నిరూపించాడని సిరి వ్యాఖ్యానించింది. శ్రీరామ్ మాట్లాడుతూ.. హమీదాను చాలా మిస్సవుతున్నా... ఆమే ఉండుంటే లోన్‌ రేంజర్‌ అనే పేరు నాపై పడేది కాదు అని ఆయన అన్నాడు. హౌజ్‌ నుంచి బయటకు వెళ్లాక కచ్చితంగా హమీదాను కలుస్తానని తెలిపాడు. ఇక సన్నీ.. వరస్ట్ పర్‌ఫర్మెన్స్ కి సంబంధించి ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాడు. నేను బెస్ట్ ఇచ్చానని, అయినా అందరూ నన్ను వరస్ట్‌ పర్‌ఫెర్మర్‌గా ఇచ్చారని.. ఈ విషయంపై బాధపడినట్టు సన్నీ గుర్తుచేసుకున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.