close
Choose your channels

‘లైగర్’ రిలీజ్ డేట్ ఫిక్స్... రౌడీ హీరో ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా ఇచ్చిన మేకర్స్

Thursday, December 16, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘‘లైగర్’’. అనన్య పాండే హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, పూరి జగన్నాథ్, ఛార్మి, అపూర్వా మెహతా నిర్మిస్తున్నారు. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ‘‘లైగర్’’లో కీలకపాత్ర పోషిస్తున్నారు. కోవిడ్ , లాక్‌డౌన్‌ల కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే అప్పుడెప్పుడో ఫస్ట్‌లుక్, మైక్ టైసన్‌తో ఫోటోలు రిలీజ్ చేయకపోవడంతో రౌడీ హీరో అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

దీంతో ‘లైగర్’ సినిమా నుంచి డబుల్ ధమాకాగా రెండు అప్ డేట్స్ ఇచ్చారు మేకర్స్. ఒకటి ‘లైగర్’ సినిమా రిలీజ్ డేట్.. సినిమాను వచ్చే ఏడాది ఆగస్ట్ 25న విడుదల చేస్తామని ప్రకటించేశారు. ఇక రెండో అప్ డేట్ విషయానికి వస్తే.. న్యూఇయర్ కానుకగా డిసెంబర్ 31న ‘లైగర్’ నుంచి గ్లింప్స్‌ను విడుదల చేస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను స‌రికొత్త లుక్‌, క్యారెక్ట‌రైజేష‌న్‌తో పూరి త‌న‌దైన స్టైల్లో సిల్వ‌ర్ స్క్రీన్‌పై ప్రెజంట్ చేస్తున్నారు. ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. లైగర్ ద్వారా బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే .. టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.