close
Choose your channels

పొలిటికల్ పొగరుతో దాడి చేశారు : రాహుల్ సిప్లిగంజ్

Thursday, March 5, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగు బిగ్‌బాస్-3 విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో కొందరు వ్యక్తులు బీరు బాటిళ్లతో దాడి చేసిన విషయం విదితమే. దాడి చేసిన వ్యక్తులు కాంగ్రెస్ తరఫున గెలిచిన టీఆర్ఎస్‌లోకి జంప్ అయిన వికారాబాద్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి అని తెలిసింది. ఈ ఘటనపై ఇంతవరకూ ఎమ్మెల్యే తరఫున ఎవరూ స్పందిచలేదు.. అంతేకాదు.. రాహుల్ కూడా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయకపోవడంతో అసలేం జరుగుతోందో తెలియరాలేదు. అయితే ఎట్టకేలకు తన మిత్రులతో కలిసి సిప్లిగంజ్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. గురువారం మధ్యాహ్నం గచ్చిబౌలి పీఎస్‌లో ఆయన ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదులో ఏముంది!?
నాపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. నాతో పాటు ఉన్న మహిళల పట్ల కూడా దాడి చేసి.. అసభ్యంగా ప్రవర్తించారు. మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు.
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి నాపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. పబ్బులో జరిగిన సంఘటనకు సంబంధించి సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలి’ అని ఫిర్యాదులో రాహుల్ రాసుకొచ్చాడు.

బ్యాగ్రౌండ్ ఉందని రెచ్చిపోతున్నారు!
ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్ ఒకింత భావోద్వేగానికి లోనయ్యాడు. ‘గచ్చిబౌలిలోని పబ్‌లో కొంత వ్యక్తులు నన్ను డాష్ కొట్టారు. ఎందుకు డాష్ ఇచ్చారని.. నేను క్వశ్చన్ చేశాను. నన్ను తిడుతూ మరి వచ్చి దాడి చేశారు. నాతో పాటు ఐదు మందిని స్నేహితులతో వెళ్ళాను.. నాతో పాటు ఉన్న ఇద్దరు స్నేహితురాళ్లను కూడా అసభ్యకరంగా మాట్లాడారు. దీంతో నేను వారిని క్వశ్చన్ చేస్తుండగా నాపై బీర్ బాటిల్స్‌తో దాడి చేశారు. రితేష్ రెడ్డి‌తో పాటు పది మంది ఉన్నారు. పొలిటికల్ పొగురుతో నాపై దాడి చేశారు. రితేష్ రెడ్డి ఎవరో కూడా నాకు తెలియదు. నేను గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. పోలీసులు న్యాయం చేయాలని కోరుచున్నాను.

నాపైన హవా చూపించాలని దాడి చేశారు. నాతో పాటు వచ్చిన అమ్మాయిలను కామెంట్ చేస్తూ.. నన్ను పుష్ చేశారు. ఆ తర్వాత నాపైన బాటిల్స్‌లో 10 మంది కలిసి దాడి చేశారు. ఈ కేసులో పొలిటికల్ ఇన్‌ఫ్లూయన్స్ ఉపయోగించే అవకాశం ఉంది. నాకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నాను. రాహుల్‌పై దాడి చేశామని వాళ్ళు చెప్పుకొని తిరిగడానికే నాపై దాడి చేశారు. పొలిటికల్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ ఉందని రెచ్చిపోతున్నారు. పలు పబ్బుల్లో ఇలాగే గొడవలు చేస్తుంటారని తెలిసింది. దర్యాప్తును కచ్చితంగా తప్పుదోవపట్టిస్తున్నారు’ అని రాహుల్ మీడియా ముందు ఒకింత భావోద్వేగానికి లోనయ్యాడు.

ఇదిలా ఉంటే.. గాయపడ్డ తర్వాత రాహుల్‌.. ఆసపత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి వెళ్లిపోయిన అనంతరం ఇవాళ మధ్యాహ్నం ఫిర్యాదు చేశాడు. పబ్‌లో లభించిన వీడియో దృశ్యాల ఆధారంగా తాము ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించామని పోలీసు ఉన్నతాధికారి మీడియాకు వెల్లడించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.