close
Choose your channels

రవిబాబు దర్శకత్వంలో రాజ్ తరుణ్

Tuesday, February 20, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తక్కువ బడ్జెట్‌తో ఓ సినిమా నిర్మించాలంటే.. కథానాయకుల జాబితాలో రాజ్ తరుణ్ పేరు ఎలా ఉంటుందో.. దర్శకుల జాబితాలో రవిబాబు పేరు కూడా అలా ఉంటుంది. గతంలో తక్కువ బడ్జెట్ సినిమాలతో ఘన విజయాలను సొంతం చేసుకున్నారు ఈ ఇద్ద‌రు. అలాంటి వీరిద్దరి కలయికలో ఓ సినిమా రాబోతోందనే కథనాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఈ సినిమాని స్వప్నదత్ నిర్మిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ప్ర‌స్తుతం రాజ్ త‌రుణ్‌, ర‌విబాబు చేస్తున్న ప్రాజెక్ట్స్ పూర్తైన తర్వాతే.. వీరి కలయికలో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇదిలా వుంటే.. ప్రస్తుతం రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రాజుగాడు` సినిమా తెరకెక్కుతోంది. అలాగే.. డైరెక్టర్ రవిబాబు కూడా అదుగో` సినిమాని రూపొందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకుని నిర్మాణానంతర పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం వేసవిలో విడుదల కానుంది. రవిబాబు సినిమాతో పాటు మరో రెండు సినిమాలను కూడా రాజ్ తరుణ్ లైన్లో పెట్టారని సమాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.