close
Choose your channels

హిమాలయాలకు రజనీకాంత్

Wednesday, July 31, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హిమాలయాలకు రజనీకాంత్

తలైవా, సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో `దర్బార్` సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ముగియనుంది. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ముగిసిన తర్వాత డబ్బింగ్ చెప్పడం కంటే ముందుగానే హిమాలయాలకు వెళుతున్నారట. ప్రొఫెషనల్ విషయాలను పక్కన పెడితే ప్రతి ఏడాది రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లి కొన్ని రోజులు గడిపి వస్తుంటారు.

అలాగే ఈ ఏడాది పది రోజుల పాటు హిమాలయాల్లోనే రజనీకాంత్ ఉంటారట. అక్కడ నుండి తిరిగి వచ్చిన తర్వాత డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేస్తారట. అలాగే తదుపరి చిత్రాల గురించిన చర్చల్లోనూ ఆయన పాల్గొంటారని వార్తలు వినపడుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.