ద‌ర్శ‌కేంద్రుడి ప్ర‌శంసను మ‌ర్చిపోలేను! - రామ్ కార్తీక్

  • IndiaGlitz, [Saturday,March 16 2019]

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు అంత‌టి దిగ్గ‌జం నా సినిమా వీక్షించి చ‌క్క‌ని ఎమోష‌న్స్ పండించావ‌ని కితాబిచ్చారు. ఆ అరుదైన ప్ర‌శంస‌ నాలో ఎంతో ఉత్సాహం నింపింద‌ని అంటున్నారు యువ‌హీరో రామ్ కార్తీక్.

ఈ యంగ్ హీరో న‌టించిన రెండు సినిమాలు వేర్ ఈజ్ వెంక‌ట ల‌క్ష్మి, మౌన‌మే ఇష్టం .. ఒకేసారి థియేట‌ర్ల‌లోకి రిలీజ‌య్యాయి. ఈ రెండు సినిమాల్లో త‌న న‌ట‌న‌కు ప్ర‌త్యేకంగా ప్ర‌శంస‌లు ద‌క్కాయ‌ని ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. రెండూ ఒకేసారి రిలీజ‌వ్వ‌డం ఉల్లాసం నింపితే, అవి రెండూ చ‌క్క‌ని టాక్ తో విజ‌య‌వంతంగా థియేట‌ర్ల‌లో ర‌న్ అవ్వ‌డం బోన‌స్ అని అంటున్నారు కార్తీక్. ఇంకా ప్ర‌త్యేక‌ ఇంట‌ర్వ్యూలో ఈ యువ‌క‌థానాయ‌కుడు చెప్పిన సంగ‌తులివి.

ఒకేసారి రెండు రిలీజ్ లు.. స్పంద‌న ఎలా ఉంది?

నేను న‌టించిన వేర్ ఈజ్ వెంక‌ట‌ల‌క్ష్మి, మౌన‌మే ఇష్టం ఒకేసారి రిలీజ‌య్యాయి. ఇది అరుదైన స‌న్నివేశం. ప్రేక్ష‌కుల నుంచి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. థియేట‌ర్ల‌లో ఎమోష‌న్ సీన్స్ కి ప్రేక్ష‌కులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

వెంక‌ట ల‌క్ష్మి రెస్పాన్స్?

ఎమోష‌న్స్ కి.. భ‌య‌పెట్టే స‌న్నివేశాల‌కు జ‌నం బాగా క‌నెక్ట‌వుతున్నారు. నా పాత్ర‌కు స్పంద‌న బావుంది. రాయ్ ల‌క్ష్మీని త‌ప్ప ఆ పాత్ర‌లో వేరొక‌రిని ఊహించుకోలేరు అన్నంత‌గా త‌ను న‌టించారు.

'మౌనమే ఇష్టం' రెస్పాన్స్?

ఆ సినిమా ఓ అంద‌మైన ప్రేమ‌క‌థా చిత్రం. ఈ సినిమాలో నా రోల్ యువ‌త‌రం అంద‌రికీ బాగా క‌నెక్ట‌వుతోంది. బాగా న‌టించాన‌ని ప్ర‌శంస‌లు ద‌క్కాయి. నిజాయితీ ఉన్న ప్రేమ‌క‌థ ఇది. సీనియ‌ర్ క‌ళాద‌ర్శ‌కులు అశోక్ గారు అద్భుతంగా తెర‌కెక్కించారు. స‌హ‌జ‌సిద్ధంగా చూపిస్తూనే క‌మ‌ర్షియ‌ల్ కోణంలో తెర‌కెక్కించారు. ఆయ‌న‌కు నా సిన్సియ‌ర్ థాంక్స్.

కాంప్లిమెంట్స్?

'మౌన‌మే ఇష్టం' సినిమా చూసిన ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు గారు .. ఆన్ స్క్రీన్ చాలా ఎత్తుగా క‌నిపిస్తున్నావ్.. న‌ట‌న స‌హ‌జంగా ఉంది .. ఎమోష‌న్ పండించావ్.. బాగా న‌టించావ్‌.. అని ప్ర‌శంసించారు.హీరో కాదు.. ఆ రోల్ క‌నిపించింది!! అని అంత పెద్ద ద‌ర్శ‌కుడి ప్ర‌శంస ద‌క్క‌డం ఎంతో ఆనందాన్నిచ్చింది. నాలో కాన్ఫిడెన్స్ మ‌రింత పెరిగింది.

థియేట‌ర్లు విజిట్ చేశారా?

ప్ర‌సాద్ మ‌ల్టీప్టెక్స్ తో పాటు మాస్ థియేట‌ర్ల‌లో ఆడియెన్ స్పంద‌న చూశాను. ది బెస్ట్ రెస్పాన్స్ ద‌క్కింది.

భ‌విష్య‌త్ ప్రాజెక్టులు?

తెలుగు, త‌మిళంలో అవ‌కాశాలొస్తున్నాయి. ప్రస్తుతం చ‌ర్చ‌లు సాగుతున్నాయి.

భ‌విష్య‌త్ ప్లానింగ్?

నా గ‌త చిత్రాలు మామ చంద‌మామ‌, మంచు కురిసే వేళ‌లో సినిమాల్లో నా న‌ట‌న‌కు చ‌క్క‌ని పేరొచ్చింది. తాజాగా రిలీజైన రెండు చిత్రాల‌కు ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. ఇక‌పైనా విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టించాల‌నుంది. నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లు అంటే ఇష్టం. ప్రేక్ష‌కులు మెచ్చే కొత్త క‌థ‌ల్ని ఎంచుకుంటాను. ల‌వ‌ర్ బోయ్ పాత్ర‌లే కాదు.. కొంచెం ర‌గ్గ్ డ్ గా ఉండే మాస్ పాత్ర‌లు చేయాల‌నుంది.

స్వ‌స్థ‌లం.. స్వ‌గ‌తం?

పుట్టి పెరిగింది హైద‌రాబాద్ లో. అయితే మా కుటుంబానికి విజ‌య‌న‌గ‌రం- వైజాగ్ క‌నెక్ష‌న్ ఉంది. నాన్న‌గారు స్థిరాస్తి రంగంలో ఉన్నారు.

More News

బిగ్‌ బీ‌కి బిగ్ థ్యాంక్స్..: సైరా డైరెక్టర్

బాలీవుడ్‌లో ప‌లు ప్రాజెక్ట్‌ల‌తో బిజీగా ఉన్న అమితాబ్ బ‌చ్చన్ మెగాస్టార్ చిరంజీవి కెరియ‌ర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కుతున్న సైరా చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే.

శివాజీ రాజా కుంభకోణాలు బయటపెట్టిన నరేశ్!

‘మా’ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన నరేశ్.. ఇంతక మునుపు టెర్మ్‌లో ఉన్న శివాజీ రాజా బాగోతాన్ని బయటపెట్టారు. శనివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన కొన్ని షాకింగ్..

బాబును నమ్మించి.. రూ.43 కోట్లతో వైసీపీలోకి కీలకనేత

అవును మీరు వింటన్నది నిజమే.. ఇటీవల నెల్లూరు రూరల్ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరును టీడీపీ అధిష్టానం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పక్కా ప్లాన్‌తో తనకు గత 15 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వంలో

'ఎవ‌రికీ చెప్పొద్దు' ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన శ‌ర్వానంద్‌

క్రేజీ ఆర్ట్స్‌ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై బసవ శంకర్ దర్శకత్వంలో రాకేశ్‌ వర్రే, గార్గేయి యల్లాప్రగడ జంటగా నటించిన చిత్రం 'ఎవరికీ చెప్పొద్దు'. రాకేశ్ వ‌ర్రీ ఈ చిత్రంలో హీరోగా న‌టించ‌డ‌మే కాదు..

'మ‌జిలీ' డ‌బ్బింగ్ పూర్తి

పెళ్లి త‌ర్వాత నాగ‌చైత‌న్య‌, స‌మంత అక్కినేని జంట‌గా న‌టిస్తున్న చిత్రం `మ‌జిలీ`. షైన్ స్కీన్స్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. శివ నిర్వాణ ద‌ర్శ‌కుడు.