close
Choose your channels

చంద్రబాబు కోసం రామోజీరావు తంటాలు.. ఎంతలా దిగజారారంటే..?

Monday, February 12, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చంద్రబాబు కోసం రామోజీరావు తంటాలు.. ఎంతలా దిగజారారంటే..?

రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఓవైపు సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో మరోసారి వైసీపీ ప్రభుత్వానికే పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు కొన్ని పచ్చ పత్రికలు అవాస్తవాలు చెబుతున్నాయి. తమ బాస్ చంద్రబాబుకు లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వంపై నిత్యం అసత్య కథనాలతో చంద్రబాబు ఆస్థాన పత్రిక 'ఈనాడు' బురద జల్లుతోంది. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపేందుకు ప్రయత్నిస్తోంది.

టీడీపీని పైకి లేపేందుకు ప్రయత్నాలు..

ఐసీయూలో కొనఊపిరితో ఉన్న చంద్రబాబు పార్టీని పైకి లేపేందుకు ఈనాడు అధినేత రామోజీరావు శతవిథాలా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం అసత్యపు కథనాలు వండివార్చి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఉచితంగా ప్రతి ఇంటికి ఈనాడు పత్రికను అందజేస్తున్నారు. ఆశ్చర్యపోతున్నారా.. కానీ మీరు చదివింది నిజమే. పేద పిల్లలు చదివే ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే తట్టుకోలేరు. పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తే అసభ్యకర వీడియోలు చూస్తూ గాడి తప్పుతున్నారని దుర్మార్గపు రాతలు రాస్తారు. రాజధానిలో పేదలకు సొంతింటి కల నెరవేర్చే దిశగా భూములు ఇస్తే తప్పుడు కథనాలు ప్రచురిస్తారు.

చంద్రబాబు కోసం రామోజీరావు తంటాలు.. ఎంతలా దిగజారారంటే..?

బుదరరాతలపై ప్రజలు ఆగ్రహం..

అయినా ఈ తప్పుడు రాతలను చూసి జనం కూడా నవ్వుకుంటున్నారు. తన బాస్ చంద్రబాబు కోసం రామోజీరావు పడే తపన చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన చరిత్ర చంద్రబాబుది అని చర్చించుకుంటున్నారు. అదే సమయంలో ఇచ్చిన హామీల్లో 99శాతం అమలు చేసిన ఘనత సీఎం వైయస్ జగన్‌ది అని కొనియాడుతున్నారు. అందుకే జగన్ ప్రభుత్వం పేదలకు ప్రయోజనం కలిగించే ఏ కార్యక్రమం చేపట్టినా ఎల్లోమీడియా బురదరాతలు రాస్తూనే ఉన్నాయని మండిపడుతున్నారు.

ఉచితంగా ఈనాడు పత్రిక..

ఇలాంటి పనికిమాలిన కథనాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టంచేస్తున్నారు. అందుకే ఈనాడు పత్రికను కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోక సరికొత్త ఎత్తుగడకు తెరతీశారు. టీడీపీని, చంద్రబాబును జాకీలు వేసి లేపడం కోసం చివరకు తన పత్రికను ఉచితంగా పంచేందుకు సిద్ధపడ్డారు రామోజీరావు. ప్రభుత్వంపై, సీఎం వైయస్ జగన్‌పై రాసే తప్పుడు కథనాలు ప్రజలకు చేరేలా లక్షల కాపీలు పంచుతున్నారు. కానీ రామోజీ పాట్లు చూసి అయ్యో పాపం అనుకుంటున్నారు. ఎన్ని తప్పుడు రాతలు రాసినా, ఉచితంగా పత్రిక ఇచ్చినా చంద్రబాబును నమ్మే స్థితిలో ప్రజలు లేరని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.