close
Choose your channels

రానా కొత్త చిత్రం అప్‌డేట్‌

Tuesday, March 6, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

భూస్వాముల ధ‌నాన్ని కొల్లగొట్టి.. పేదలకు పంచిపెట్టే కథే రాబిన్ హుడ్ స్టోరీ. ఇటువంటి రాబిన్ హుడ్ కథతో యువ క‌థానాయ‌కుడు రానా ఓ సినిమా చేయ‌నున్నారు. తెలుగు వారి రాబిన్ హుడ్‌గా చెప్పుకునే స్టువర్టుపురం టైగర్ నాగేశ్వరరావు జీవితకథ ఆధారంగా తెరకెక్కబోయే ఈ చిత్రంలో.. రానా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

'దొంగాట', 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' చిత్రాల ద‌ర్శ‌కుడు వంశీ కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్ ఆఖరి వారంలో పూజా కార్యక్రమాలను జరుపుకుని.. మే మొదటివారం నుంచి ఈ సినిమా నిరవధికంగా చిత్రీకరణ జరుపుకోనుంద‌ని తెలిసింది. ఈ మూవీని ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం రానా ఓ వైవిధ్యమైన వేషధారణలో కనిపించనున్నారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్ప‌టికే కసరత్తులు కూడా ప్రారంభించారు రానా. ఇప్పటికే రానా పలు చిత్రాల్లో నటిస్తున్నా.. 'నేనే రాజు నేనే మంత్రి' తర్వాత నేరుగా తెలుగులో చేస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.