close
Choose your channels

నాసాపై ఆర్‌సీబీ జోక్.. కన్నెర్రజేస్తున్న ట్వీపుల్స్!!

Thursday, December 5, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నాసాపై ఆర్‌సీబీ జోక్.. కన్నెర్రజేస్తున్న ట్వీపుల్స్!!

ఇస్రో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2లో భాగంగా విక్రమ్ ల్యాండర్‌ను జాడను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కనిపెట్టిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతంలో ఇన్నాళ్లూ చీకటిగా ఉండటం, దానికి తోడు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ల్యాండర్ జాడను కనుగొనడానికి శాస్త్రవేత్తలు కాస్త ఇబ్బంది పడ్డారు. అయితే ఇప్పుడు ఆ చీకటి తొలగిపోయి ఆ ప్రాంతంలో వెలుగు రావడంతో ల్యాండర్‌ జాడను నాసా కనిపెట్టింది. మంగళవారం రోజున ఇందుకు సంబంధించిన ఫోటోలను నాసా రిలీజ్ చేసింది. మరోవైపు చెన్నైకి చెందిన ఇంజినీర్ షణ్ముగ సుబ్రమణియన్ కనిపెట్టానని చెప్పుకుంటుండగా.. ఈ వ్యవహారంపై ఇస్రో స్పందిస్తూ అబ్బే అదేం లేదు తామే ముందు కనుగొన్నామని అవసరమైతే వెబ్‌సైట్‌లో చూడాలని స్పష్టం చేసింది.

మాకూ సాయం చేయండి..!

ఈ సందర్భంగా ఐపీఎల్ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు నాసాకు ఓ వింత రిక్వెస్ట్ పెట్టింది. నాసా టీం.. విక్రమ్ ల్యాండర్ జాడను కనిపెట్టినట్లుగా మా బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్, కోహ్లీ కొట్టిన బంతులను కూడా కనిపెట్టడంలో సాయం చేయండంటూ ట్విట్టర్‌లో కోరింది. అయితే ఈ ట్వీట్‌ ఆర్సీపీ ఏ నిమిషాన పెట్టిందో ఏమోగానీ నెటిజన్లు.. క్రీడాభిమానులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇన్ని మాటలెందుకు.. ముందు మీరు ఐపీఎల్ ట్రోఫీని ఎలా గెలవాలో మార్గాలు కనిపెట్టుకోండి..? అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. కనీసీం ఈసారైనా మంచి బౌలర్లను కొనుక్కొని కప్ గెలవడానికి ప్రయత్నించండి తర్వాత చూద్దామని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

నెటిజన్ల మరికొన్ని కామెంట్స్

ఏబీడీ, కోహ్లీ కొట్టిన బంతుల్ని గుర్తించడం కన్నా.. మ్యాచులు ఎలా గెలవాలో కనుగొనేందుకు నాసా సాయం చేస్తే బాగుంటుంది

ఇవన్నీ కాదులే కానీ ముందు మంచి బౌలర్‌ను కనుక్కోండి

నేను ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో కిందే ఉండటం కనుగొంటా

వెంటనే ఆర్‌సీబీ ట్విటర్‌ నిర్వాహకుడిని తొలగించండి.. ఫైనల్లో ఓడిపోయినప్పుడూ కూడా ఇంత ఘోరంగా అనిపించలేదు అని మరికొందరు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా.. ఐపీఎల్ మొదలయి సుమారు 12 సంవత్సరాలు అయినా ఇంతవరకూ ఆర్సీబీ ఒక్క ఐపీఎల్‌ టైటిల్‌ కూడా సాధించలేదు. ఇదిలా ఉంటే.. డిసెంబర్ 19 నుంచి ఐపీఎల్‌ వేలం జరుగనుంది. దీంతో క్రీడాభిమానులు ఇప్పట్నుంచే హడావుడి మొదలెట్టేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.