close
Choose your channels

CM Jagan:రాజకీయంగా ఎదుర్కోలేక సీఎం జగన్‌ మీద దాడి చేసిన చంద్రబాబు బ్యాచ్

Sunday, April 14, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విజయవాడలో సీఎం జగన్‌పై టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. బస్సు యాత్రలో భాగంగా సింగ్ నగర్‌కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్‌పై ఓ అగంతకుడు రాయి విసిరాడు. బస్సుపై పుంచి జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయితో దాడి జరిగింది. అయితే ఆ రాయి వేగంగా వచ్చి జగన్ కనుబొమ్మకు తాకడంతో గాయం జరిగింది. దీంతో జగన్ ఎడమ కంటికి కనుబొమ్మపై గాయమైంది. పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కూడా స్వల్ప గాయం అయ్యింది. వెంటనే సీఎం జగన్‌కి బస్సులోనే డాక్టర్ హరికృష్ణ ప్రథమ చికిత్స అందించారు. అనంతరం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లాలో సీఎం జగన్‌కి వస్తున్న ప్రజాభిమానం ఓర్వలేక టీడీపీ నేతలు తమ కార్యకర్తల చేత దాడి చేయించారని సమాచారం. రాయి కొద్దిగా అటు ఇటు తగలడంతో స్వల్ప గాయమైంది. లేదంటే కంటి చూపు పోయేది అని వైద్యులు చెబుతున్నారు. జగన్‌కువస్తున్న ఆదరణ చూసి ఓటమి భయంతో చంద్రబాబు బ్యాచ్ ఉక్రోషంతో రగిలిపోతున్నారని.. అందుకే ఇలాంటి దాడులకు ప్రేరేపిస్తున్నారని వైసీపీ నేతలు మండిడుతున్నారు. ఇటీవల ప్రజాగళం సబలో జగన్.. నీకు నేను ఏంటో చూపిస్తా అని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. తాజాగా రాయితో దాడి జరిగింది.

ఇదంతా చూస్తుంటే పక్కా ప్రణాళిక ప్రకారమే జగన్‌పై చంద్రబాబు దాడి చేయించారని అర్థమవుతోందని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి మీద జరిగిన దాడిని ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌ రావు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదని తెలిపారు. రాళ్ల దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ దాడిపై సీరియస్‌ అయింది. ఘటనపై పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలా ఉంటే సీఎం జగన్ పై రాళ్లదాడిని ఎల్లో మీడియా దారుణంగా కథనాలు ప్రసారం చేసింది. ఏమాత్రం సానుభూతి లేకుండా ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగినట్టు ప్రజల్లో అనుమానం కలిగేలా కథనాలు వండి వార్చుతున్నాయి. సెక్యూరిటీ వైఫల్యం అని, కోడికత్తి కమల్ హాసన్ అంటూ విషపు రాతలకు తెరదీశాయి. దీంతో ఈ వార్తలను ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారు. ఎన్నికల్లో టీడీపీ బ్యాచ్‌కు తమ ఓటుతో మరోసారి బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.