close
Choose your channels

సోషల్ మీడియా వేదికగా వైసీపీపై టీడీపీ దుష్ప్రచారం.. లక్షల మందితో టీమ్..

Tuesday, April 16, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సోషల్ మీడియా వేదికగా వైసీపీపై టీడీపీ దుష్ప్రచారం.. లక్షల మందితో టీమ్..

ఏపీలో ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం పీక్ స్టేజ్‌కి చేరుకుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారాన్ని హీటెక్కిస్తున్నారు. మరోవైపు ఫేక్ ప్రచారం కూడా ఊపందుకుంది. సోషల్ మీడియా వేదికగా తప్పుడు సమాచారం వైరల్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇందుకోసం వాట్సాప్ గ్రూపులు, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ ఇలా పలు ఫ్లాట్ ఫామ్స్ ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా అధికార వైసీపీపై ఈ తప్పుడు ప్రచారం జోరందుకుంది.

ఈ ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా బరితో దిగగా.. టీడీపీ-బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. అయినా కానీ సీఎం జగన్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి టీడీపీ కూటమి ఓర్చుకోలేకపోతోంది. దీంతో తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. ఇప్పటికే టీడీపీకి కొన్ని పత్రికలు, ఛానల్స్ మద్ధతు ఇవ్వడమే కాకుండా ఆ పార్టీకి అనుకూలంగా పలు కథనాలను సైతం ప్రచారం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా సోషల్ మీడియాను కూడా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందని సమాచారం. ఈ క్రమంలోనే సామాజిక మాధ్యమాల వేదికగా తప్పుడు ప్రచారాలను చేసేందుకు భారీ స్థాయిలో సొంతంగా టీమ్ ఏర్పాటుచేసుకుందని తెలుస్తోంది.

సోషల్ మీడియా వేదికగా వైసీపీపై టీడీపీ దుష్ప్రచారం.. లక్షల మందితో టీమ్..

ఈ క్రమంలోనే సుమారు 1.5 లక్షల వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేయడంతో పాటు 500 సోషల్ మీడియా ఫేజీలను కూడా సిద్ధం చేశారు. వీటితో పాటు ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్‌స్టా ఫ్లాట్ ఫామ్స్‌పై నుంచి అసత్య ప్రచారాలను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సుమారు 2.5లక్షల మందితో ‘ మన టీడీపీ’(Mana TDP) పేరుతో టీడీపీ అప్లికేషన్స్ సిద్ధం చేసిందని తెలుస్తోంది. వీటి ద్వారా సీఎం వైఎస్ జగన్ మీద మార్ఫింగ్ పిక్స్, మీమ్స్, తప్పడు సర్వేలు ప్రచారం చేయడమే కాకుండా టీడీపీకి అనుకూలంగా ఉండే వార్తలను మాత్రమే ప్రచారం చేస్తున్నారని సమాచారం.

అయితే టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో అధికార వైసీపీకి వస్తున్న ప్రజాదరణ చూడలేకనే ఇలా ఫేక్ కంటెంట్లు ప్రచారం చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమికి ఓటమి తప్పదనే భయంతోనే సీఎం జగన్‌తో పాటు వైసీపీపై సోషల్ మీడియా వేదికగా అసత్యాలు ప్రచారం చేయడంపై మండిపడుతున్నారు. పోలింగ్ జరిగే వరకు పచ్చ బ్యాచ్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. దీంతో ఇన్నాళ్లు మీడియా మ్యానేజ్మెంట్ చేసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సోషల్ మీడియాను మ్యానేజ్ చేయడానికి సిద్ధం కావడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.