'బిగ్‌బాస్ 3' కి హైకోర్టులోఊరట
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ మూడో సెషన్ `బిగ్‌బాస్ 3` ప్రారంభానికి ముందే పలు వివాదాలకు కేంద్రమైంది. నటీమణులు శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా బిగ్‌బాస్‌లో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ ఆరోపణలు చేసి సంచనాలకు తెర తీశారు. అలాగే జంజారా హిల్స్, రాయదుర్గం పోలీస్ స్టేషన్స్‌లో కేసులు నమోదయ్యాయి. బిగ్‌బాస్ షోను ఆపాలంటూ, నిర్వాహకులను అరెస్ట్ చేయాలంటూ పిటిషనర్స్ తెలంగాణ హైకోర్టును కోరారు.
అయితే వీటికి భిన్నంగా నిర్వాహకులు తమను అరెస్ట్ చేయరాదంటూ క్వాష్ పిటిషన్ వేశారు. కేసును పరిశీలించిన హైకోర్ట్.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులు, పిటిషనర్‌ను కోరుతూ కేసును వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు నిర్వాహకులను అరెస్ట్ చేయరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. బిగ్‌బాస్ 3 ఈ నెల 21న నాగార్జున వ్యాఖ్యాతగా ప్రారంభం కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.