close
Choose your channels

శామ్‌సంగ్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసిందోచ్..

Friday, February 22, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో కస్టమర్స్‌ కోసం సరికొత్త మోడల్స్‌‌ను శామ్‌సంగ్ రిలీజ్ చేస్తున్న విషయం విదితమే. దక్షిణ కొరియాకు చెందిన ఈ ప్రముఖ మల్టీనేషనల్ కమ్యూనికేషన్ సంస్థ తాజాగా తమ కస్టమర్లకు తియ్యటి శుభవార్త అందజేసింది. మడతపెట్టే స్మార్ట్‌ఫోన్‌‌ను శామ్‌సంగ్ మార్కె్ట్‌‌లోకి వదిలింది. సాధారణ స్మార్ట్‌ఫోన్లకంటే అధిక ఫీచర్లతో రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను గ్రీన్, బ్లూ, సిల్వర్, బ్లాక్ నాలుగు రంగుల్లో రూపొందించినట్లు సదరు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా ఎంపిక చేసిన కొన్ని దేశాల్లోనే ఏప్రిల్ 26న ఈ ఫోన్‌‌‌ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

ఫోన్ పీచర్స్ ఇవీ..

వేరియంట్స్: 4జీ ఎల్టీఈ, 5జీ
డిస్‌‌ప్లే: 7.3 అంగుళాలు
మెమెరీ: 12 జిబీ, 512 జీబీ
బ్యాటరీ : 4380 ఎంఏహెచ్
కెమెరాలు : మొత్తం 06 (16 మెగా ఫిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా)
ప్రారంభం ధర: రూ. 1,41,300/ మాత్రమే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.